వచ్చే సంక్రాంతికే కాదు.. వచ్చే వేసవికి కూడా మన స్టార్స్‌తో పాటు చిన్నచితకా హీరోలు కూడా తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి డేట్స్ వెత్తుక్కుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి సీజన్‌కి పవన్‌కళ్యాణ్, బాలకృష్ణలు క్యూకట్టేసి డేట్స్‌ని లాక్ చేసుకుంటున్నారు. రామ్‌చరణ్, సుకుమార్‌ల 'రంగస్థలం 1985'కి కూడా ఇంకా డేట్ విషయంలో డైలమాలో ఉండటానికి షూటింగ్ లేట్ కావడంతో పాటు బాబాయ్ పవన్‌కళ్యాణ్ పోటీలో ఉంటే తాను కూడా పోటీలో ఉండటం మంచిది కాదని రామ్‌చరణ్ భావిస్తున్నాడు. ఇక వచ్చే సంక్రాంతికే అనుష్క ద్విపాత్రాభినయం చేస్తూ 'పిల్లజమీందార్' ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ 'భాగమతి'ని కూడా విడుదల చేస్తారని సమాచారం.
ఇక రాజ్‌తరుణ్ 'రాజుగాడు.. యమడేంజర్' వంటి చిన్న చిత్రాలు కూడా సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. తాజాగా సంక్రాంతి రేస్ లోకి రవితేజ టచ్ చేసి చూడు కూడా లైన్లోకివచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పోటీ ఇలా ఉంటే ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సూర్య కూడా సంక్రాంతికే వస్తానంటున్నాడు. ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ వెర్షన్ టైటిల్ 'థానా సేంద కూటమ్'. సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల అవుతాయి. ఇక '24' చిత్రమైతే తమిళంలో కన్నా తెలుగులోనే మంచి విజయం సాధించింది. దీంతో సూర్య సంక్రాంతికే వస్తే తమిళం సంగతేేమో గానీ తెలుగులో మాత్రం థియేటర్ల నుంచి ఓపెనింగ్స్ వరకు తిప్పలు తప్పవు.
తమిళంలో కూడా సూర్య ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే కేవలం కలెక్షన్లు సాధించడానికి రెండు వారాల సమయం కూడా ఉండదు. మరి సూర్య మొదట ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసి తర్వాత తెలుగులో రాకతప్పదు. అదే ఈ చిత్రం కూడా సంక్రాంతికే వస్తే పవన్-త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తున్న కీర్తిసురేష్ నటించే రెండు చిత్రాలు ఒకేసారి వస్తాయి. అంతేకాదు.. పవన్, సూర్య..ఇలా రెండు చిత్రాలకు అనిరుధ్‌నే సంగీతం అందిస్తుండటంతో అనిరుధ్ రెండు చిత్రాలు కూడా ఒకేసారి పోటీపడతాయి.