Advertisementt

విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!

Tue 31st Oct 2017 06:09 PM
vijay devarakonda,trend setter,private party,celebrities  విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!
Vijay Devarakonda Tollywood Trend Setter విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి మంచి ఆఫర్స్ తో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. తాను సెలెక్ట్ చేసుకునే సినిమాల దగ్గర నుండి.. తన మాట తీరు కానీ, తన ప్రవర్తన, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ బాలీవుడ్‌ నయా తరం హీరోలని అనుసరిస్తున్నాడు. బోల్డ్‌గా వుంటే యూత్‌కి తొందరగా కనక్ట్‌ అవ్వవచ్చనేది కనిపెట్టి అందుకు తగ్గట్టే వాటిని ఫాలో అవుతున్నాడు.

అయితే ఈ కుర్ర హీరో తనకి మంచి మంచి హిట్స్ వస్తున్నా... ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ అంటూ ఎవరు లేరు. అయితే ఇప్పుడు విజయ్ కి ఇండస్ట్రీ పెద్దలతో, స్టార్స్ తో స్నేహసంబంధాలు కొనసాగిస్తేనే ఇక్కడ సినీపరిశ్రమలో నెగ్గగలుగుతామని కనిపెట్టేసినట్లున్నాడు. అందుకే దానికి తగినట్టుగా మనోడు ఇప్పుడు బాలీవుడ్ లోలా పార్టీలు గట్రా ఇచ్చేస్తూ బిజీ అయ్యాడు. బాలీవుడ్  లోకి కొత్తగా ఎవరు హీరోగా వచ్చినా... తమ సర్కిల్ పెంచుకునేందుకు రిచ్ గా పార్టీలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీ వారైతే పరిశ్రమలోకి చొచ్చుకుపోవొచ్చని ఈ పార్టీలు ఇస్తారు.

అయితే ఇప్పుడు అచ్చంగా అలాంటి పద్ధతిని విజయ్‌ కూడా ఫాలో అవుతున్నాడు. తనకు పరిశ్రమలో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఇలా గ్రాండ్ గా పార్టీ ఇచ్చి అందరిని ఫ్రెండ్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోస్ విజయ్ కి ఫ్రెండ్స్ అయిపోయారు. కేవలం స్టార్స్ ని మాత్రమే కాదు... నిర్మాతలు, దర్శకులని కూడా విజయ్ ఆకర్షిస్తున్నాడు. ఇక స్టార్‌ దర్శకుల దృష్టిలోను పడ్డాడంటే బిగ్‌ లీగ్‌లో చేరిపోవడం అంత కష్టమేమీ కాదు. ఏది ఏమైనా విజయ్ మన టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవొచ్చు.

Vijay Devarakonda Tollywood Trend Setter:

Vijay Devarakonda Private Party to Celebrities

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ