పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అయిన అన్నా లెజినోవా ను 2013 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె పవన్ కు మూడో భార్య కాగా స్వస్థలం రష్యా. వీరిద్దరికి ఈ మధ్యే ఓ బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఆ బాబుకి 'మార్క్ శంకర్ పవనోవిచ్' అని నామకరణం చేశారు
అయితే ఈ పేరులో ఓ విశేషం వుంది! ఈ పేరులో మెగాస్టార్ చిరంజీవి మొదటి పేరు దాగివుంది. చిరంజీవి అసలు పేరు 'శివశంకర వరప్రసాద్'. అన్నయ్యపై వున్న ప్రేమకి చిహ్నంగా పవన్.. తన కొడుకు పేరులో చిరు పేరు పెట్టి, తన దృష్టిలో అన్నయ్య స్థానం ఏమిటో చూపించాడు.
ఇక పవనోవిచ్ అనే పేరులో పవన్ పేరు కూడా వుంది. పేరు వినటానికి చాలా కొత్తగా కూడా వుంది. పవనోవిచ్ లో సగం పవన్ అర్ధం అయింది కానీ మిగతా సగం నోవిచ్ అంటే ఏమిటో తెలియాల్సి వుంది. బహుశా అది వాళ్ల భార్య అన్నా ఫ్యామిలీకి సంబంధించినది కావచ్చునేమో. పవన్, అన్నా లెజినోవాలకి ఓ పాప కూడా కుంది. ఆమె పేరు 'పొలిన అంజన పవనోవ'. ఈ పేరులో పవన్.. వాళ్ల అమ్మ పేరు అంజన అని పెట్టడం విశేషం. సో.. మొత్తానికి పవన్ కి అమ్మ, అన్నయ్య అంటే ఎంత ప్రేమో ఈ పేరులు చూస్తేనే అర్ధమవుతోంది.