ప్రభాస్ ఇప్పుడు 'సాహో' సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. 'బాహుబలి' సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు ఏ హీరో చేయనంత సాహసం చేసిన ప్రభాస్ ఇప్పుడు 'సాహో' కోసం కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'సాహో' సినిమాని యువి క్రియేషన్స్ వారు దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డూప్ లేకుండా ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆన్ లొకేషన్ స్టిల్ కూడా ఇప్పటి వరకు బయటకి రాలేదు. ఎందుకంటే చిత్ర బృందం మొత్తం మొబైల్ ఫోన్స్ ని లొకేషన్స్ కి తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు చిన్న విషయం కూడా లీక్ కాకుండా తీసుకున్న ఈ చర్యలు మంచి ఫలితమే ఇచ్చాయి.
అందుకే దర్శకుడు సుజిత్ తోపాటు ప్రభాస్ కూడా ఎంతో కూల్ గా షూటింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిత్ర బృందానికి ఎటువంటి సంబంధం లేకుండానే భారీ బడ్జెట్ సినిమాల ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అవుతున్నాయి. ఇందుకు సంబందించిన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. కానీ 'సాహో' టీమ్ చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతానికి సత్ఫలితాలను ఇస్తుంది. ఇక తాజాగా ప్రభాస్ అండ్ టీం అంతా మిడిల్ ఈస్ట్ కు ప్రయాణం కడుతున్నారు. అబుదాబిలో షూటింగ్ చేయబోతున్నారు. కొన్నికీలకమైన సీన్స్ ని పిక్చరైజ్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా షూటింగ్ లో మొబైల్ బ్యాన్ అనేశారట.
షూటింగ్ లో మొబైల్ బ్యాన్ కి ప్రభాస్ సహా అందరూ మద్దతు పలికారని తెలుస్తోంది. 'సాహో' గురించి ఏ మాత్రం లీక్ కాకుండా తీసుకుంటున్న చర్యలు ఇప్పటివరకూ సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బడా స్టార్స్ చాలామంది విలన్స్ గా కనబడుతున్నారు.