రాజశేఖర్ ఒకప్పుడు చాలా అందంగా ఉండేవాడు. మరలా ఇంత కాలానికి ఆయన 'పీఎస్వీగరుడవేగ'లో అంత హ్యాడ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. నాడు ఆయనకు లేడీస్‌లో ఎంతో ఫాలోయింగ్ ఉండేది. ఆయన లుక్, మరీ ముఖ్యంగా ఆయన స్మైల్‌ని మహిళలు బాగా ఇష్టపడేవారు. దాంతో 'అల్లరిప్రియుడు' సమయంలో ఆయనకు మహిళాభిమానులు ఎంతో అభిమానించేవారు. ఆయన నటించిన అంతకు ముందు చిత్రాలు కొన్ని ఉన్నా కూడా ఆయన నటించిన 'తలంబ్రాలు' చిత్రంతో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఇందులో విలనే హీరో. జీవితను మోసం చేసే పాత్ర. మొదట ఆ పాత్రను తాను చేయనని రాజశేఖర్ అన్నాడట. కానీ నిర్మాత కథ మొత్తం చెప్పడంతో ఓకే చెప్పాడట. ఈ చిత్రం షూటింగ్‌లో జీవిత ప్రతి డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చేప్పేస్తే తాను మాత్రం రెండు మూడు టేకులు తీసుకునే వాడినని, దాంతో ఆమె అంటే జెలసీగా ఫీలయ్యేవాడినని, ఒక్కసారైనా రెండో టేక్ తీసుకోదా? అని వెయిట్ చేసినా ఆమె తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాడు.
ఈ చిత్రం ద్వారా జీవితకు మంచి పేరు వస్తుందని భావించానని, తనను చూసి ప్రేక్షకులు నెగటివ్‌గా ఫీలవుతారని భావిస్తే సీన్ రివర్స్ అయిందని, ఈ చిత్రంతో తనకు మంచి పేరు వచ్చింది. థియేటర్‌లో ఓ అమ్మాయి నాకు ముద్దుపెట్టేసిందని తెలిపాడు. ఇక తాను నటించే చిత్రాలలో హీరోయిన్స్‌తో చేసే సీన్స్‌లో ఎంతో బిడియంగా, సిగ్గుగా అనిపించేదని, అదే విషయం జీవిత కూడా తనతో అనేదని, ఇప్పుడు కాస్త బాగానే మారిపోయానని చెప్పాడు. ఇక జీవితతో చేసిన 'తలంబ్రాలు, ఆహుతి, అంకుశం' చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన తర్వాత తాము పెళ్లి చేసుకున్నామని చెప్పాడు.
అంతకు ముందు తాను, జీవిత కలిసి తమిళంలో ఓ చిత్రం చేయాల్సి వచ్చిందని, తనను దర్శకుడు, నిర్మాత వచ్చి హీరోయిన్ ఎలా ఉంది? అని అడిగితే బాగా లేదు.. ఆ పాత్రకు సూట్ కాదని చెప్పానని, కానీ ఆ చిత్రం నుంచి తనను తీసేశారని, అదే విషయాన్ని 'తలంబ్రాలు' సమయంలో జీవితని అడిగితే.. మీరు హీరోగా బాగుంటారనే చెప్పానని చెప్పిందట. దాంతో తనకు జీవిత నాకు వద్దు అనుకుంటే.. ఆమె మాత్రం నాకు అతనే కావాలి అనిపించిందని, దాంతో ఇద్దరం ఒకటయ్యామని చెప్పాడు.