నక్కిన త్రినాధరావు మంచి మాస్ ఎంటర్టైనర్ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలు మాస్ ఎంటర్టైనర్స్. అయితే ఆ రెండు సినిమాలు ఒకటే సబ్జెక్టు. రెండు సినిమాల్లోనూ మామ అల్లుళ్ల సవాల్ టైపు ఉంటుంది. సినిమా మాస్ యాంగిల్ లో తెరకెక్కించినప్పటికీ మొత్తం ఫన్ తో సాగిస్తాడు. త్రినాధరావు తీసిన 'సినిమా చూపిస్తా మావ', 'నేనులోకల్' సినిమాలు అదే తరహాలో ఉంటాయి.
ఇది ఇలా ఉండగా త్రినాధరావు ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో హీరో రామ్ ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో రామ్ మొదటి సినిమా ఇది. దిల్ రాజు నిర్మాణంలో హీరో ని త్రినాధరావు సినిమా తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమాలో కూడా మామా, అల్లుళ్ల పాత్రలే కీలకం అంట. 'సినిమా చూపిస్తా మావ', 'నేనులోకల్' సినిమాల్లో మామ అల్లుళ్లు ఎదురు ఎదురుగా వుండి సినిమాను నడిపిస్తారు. అయితే ఈ సినిమాలో మామ అల్లుళ్లు పక్కపక్కనే వుండే కథను నడిపిస్తారట. అంటే వీళ్లను ఢీకొనే ముఖ్య పాత్ర మరొకటి వుంటుందన్నమాట.
మరి కథ వినటానికి బాగానే వుంది కానీ.... సినిమా ఎలా ఉంటాదో వేచి చూడాలి. ఏదిఏమైనా డైరెక్టర్ త్రినాధరావు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఫన్ జెనరేట్ చేయగలడు. ప్రస్తుతం మన టాలీవుడ్ ప్రేక్షకులకి ఏమి కావాలి కాసేపు నవ్వుతూ సినిమాని ఎంజాయ్ చెయ్యడం తప్ప. అయితే రామ్ తో పాటు వుండే మామ, వాళ్లు ఢీకొనే ప్రతినాయకుడి క్యారెక్టర్లకు ఎవర్ని తీసుకుంటారో అనేది తెలియాల్సి వుంది.