Advertisementt

అక్షయ్‌ని అటు ఇటు కాకుండా చేస్తున్నారు!

Wed 08th Nov 2017 09:33 PM
akshay kumar,padman,2.0 movie,clash,rajinikanth,kaala  అక్షయ్‌ని అటు ఇటు కాకుండా చేస్తున్నారు!
Padman to clash with 2.0? Akshay Kumar Reveals the Truth అక్షయ్‌ని అటు ఇటు కాకుండా చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

చిన్న హీరోల సంగతేమోగానీ నేటి కాలంలో స్టార్‌ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకేరోజున విడుదల కావడం అనేది మాత్రం అరుదు. అప్పుడెప్పుడో బాలయ్య నటించిన 'నిప్పురవ్వ, బంగారు బుల్లోడు' చిత్రాలు ఓకేసారి విడుదలయ్యాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌, రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '2.0'లో నటిస్తున్నాడు. ఇక శంకర్‌ చిత్రాలంటే ఆయన పాత్రలకు తగ్గట్టుగా నటులని మౌల్డ్‌ చేసే విధానం, వారి గెటప్‌లలో పలు జాగ్రత్తలు తీసుకుంటాడనేది తెలిసిందే. కాగా '2.0'లో పిచ్చి శాస్త్రవేత్తగా రిచర్డ్స్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం విడుదల చేస్తున్న పోస్టర్లలో రజనీ పోస్టర్ల కంటే అక్షయ్‌ పోస్టర్లే బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అక్షయ్‌ 15 రకాల గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఇక ఈ చిత్రం విడుదల విషయంలో లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌లు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందుగా జనవరి 25న విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ తేదీ సమ్మర్‌కి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై యూనిట్‌లోని ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 

మరోవైపు రజనీకాంత్‌ నటిస్తున్న 'కాలా' చిత్రం కూడా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ పరిస్థితుల్లో '2.0' విడుదల వాయిదా పడితే ఆచిత్రం స్థానంలో రజనీ 'కాలా' విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ రజనీ దానిని ఖండించాడు. '2.0' విడుదలైన తర్వాతనే తన 'కాలా' విడుదల అవుతుందని స్పష్టం చేశాడు. మరోవైపు అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న 'ప్యాడ్‌మేన్‌' చిత్రాన్ని మొదట '2.0'కి అడ్డురాకుండా ఏప్రిల్‌ 13న విడుదల చేయాలని భావించారు. కానీ '2.0' వాయిదాపడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 'ప్యాడ్‌మేన్‌'ని జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే '2.0' కూడా జనవరిలోనే వస్తే అక్షయ్‌ నటించిన రెండు చిత్రాలు క్లాష్‌ అయ్యే చాన్స్‌ ఉంది. దీంతో ఈ విషయంలో అక్షయ్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావని, తన చిత్రాలకు తానే పోటీగా రావడం జరగదని తెలిపాడు. '2.0' జనవరిలో వస్తే 'ప్యాడ్‌మేన్‌' సమ్మర్‌కి వెళ్తుంది. అదే '2.0' సమ్మర్‌కి వెళ్తే ఇండిపెండెన్స్‌డేకి 'ప్యాడ్‌మేన్‌'ని తెస్తామని క్లారిటీ ఇచ్చాడు. అంటే '2.0' విడుదల మీద 'ప్యాడ్‌మేన్‌' రిలీజ్‌ డేట్‌ ఆధారపడి ఉంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Padman to clash with 2.0? Akshay Kumar Reveals the Truth:

Akshay Kumar surprised his fans recently when he decided to prepone the release date of Padman from April to January.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ