Advertisementt

'కామసూత్ర' అంటే సైన్స్: స్వాతి!

Thu 09th Nov 2017 03:01 PM
swathi somanath,kamasutra,kuchipudi dancer  'కామసూత్ర' అంటే సైన్స్: స్వాతి!
Swathi Somanath about Kamasutra 'కామసూత్ర' అంటే సైన్స్: స్వాతి!
Advertisement
Ads by CJ

శాస్త్రీయ నృత్యాలను ఆదరించే వారికి కూచిపూడి నృత్యకారిణి స్వాతి సోమనాథ్‌ తెలియనివారు కాదు. తను వయసులో ఉన్నప్పుడే ఎంతో డేరింగ్‌గా 'కామసూత్ర' నృత్య రూపకం చేసింది. ఆమె తండ్రికి ఆమె పెద్ద నాట్యకారిణి కావాలని కోరిక. కానీ ఆయన త్వరగానే మరణించడంతో తన పేరుకు చివరగా తన తండ్రికి గుర్తుగా సోమనాథ్‌ అని తగిలించుకుంది. పలువురు తన పేరు చూసి తమిళియన్‌ అనుకుంటారని, కానీ తాను స్వచ్చమైన తెలుగమ్మాయినని చెప్పింది. ఇక ఈమె పెళ్లి కాకుండానే ఎంతో ధైర్యంగా 'కామసూత్ర' నృత్యరూపకం చేయడం ఆమె తల్లికి నచ్చలేదు. 

పెళ్లి కావాల్సిస అమ్మాయివి.. మరి 'కామసూత్ర'లో చేస్తే నిన్నెవ్వరు పెళ్లి చేసుకుంటారు? అని నిలదీసింది. కానీ ఆమె తన స్నేహితులు, సోదరుడి ప్రోత్సాహంతో దీనిని చేసి మెప్పించింది. ఇక ఈమె దర్శకుడు రవి చావలిని వివాహం చేసుకుంది. నిజానికి ఇద్దరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె రవిచావలికి 'కామసూత్ర' నృత్యరూపకం చేసిందని, తాను కూడా పేరున్న నృత్యకళాకారణిని అని చెప్పలేదట. తన పేరు శ్వేత అని చెప్పింది. కానీ పెళ్లి కుదిరిన తర్వాత ఆమె ఓ రోజు రాత్రి రవిచావలికి ఫోన్‌ చేసి.. నేనెవ్వరో మీకు తెలుసా? నా పేరేంటి? అని అడిగిందట. 

దాంతో ఆయన 'శ్వేత' అని చెబితే.. కాదు నాపేరు స్వాతి... స్వాతిసోమనాథ్‌ని. నేను 'కామసూత్ర' నృత్యరూపకం కూడా చేశాను. మీకు ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోండి అని చెప్పడంతో రవిచావలి దానికి అభ్యంతరం చెప్పకుండా వివాహం చేసుకున్నాడట. ఈ నృత్యరూపకం తీర్చిదిద్దడంలో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తే ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుంది? దానికి బిగినింగ్‌, మిడిల్‌, ఎండింగ్‌ ఎలా చేయాలి అనేది చేసి చూపించాను. నిజానికి 'కామసూత్ర' అనేది స్పిర్చువల్‌ కాదు.. అదో సైన్స్‌.. అని చెప్పుకొచ్చింది..!

Swathi Somanath about Kamasutra:

Kuchipudi Dancer Swathi Somanath Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ