Advertisementt

రష్మీ ఓపెన్‌ అయ్యింది..!

Fri 10th Nov 2017 12:53 PM
rashmi gautham,initial days and life,monegy,rashmi,next nuvve  రష్మీ ఓపెన్‌ అయ్యింది..!
Rashmi about Money Importance రష్మీ ఓపెన్‌ అయ్యింది..!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా, వెండితెరపై హాట్‌ గర్ల్‌గా పేరు తెచ్చుకుంటున్న నటి రష్మీ. కాగా ఈమె ఒకవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరపై కనిపిస్తూ బాగానే సంపాదిస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, నేను వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కి ఒక్కదాన్నే వచ్చాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ ఆ సమయంలో కూడా నేను ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే బాధలు పడుతూనే వచ్చాను. మొదటి చెక్‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి అందుకున్నాను. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె కట్టి, బ్యాంక్‌ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేశాను. ఈ ఇండస్ట్రీలో బిజీగా ఉండి, సక్సెస్‌ ఉంటే బాగా ఉంటుంది. లేదంటే సాయం చేసేవారు ఉండరు. ఇబ్బందుల్లో ఉండే వారికి సహాయం చేయడం మాని వారి గురించి ఆరాలు తీస్తూ గడుపుతుంటారు. కాబట్టే నాకు డబ్బు ఎంత విలువైనదో తెలిసింది. 

అందుకే నేను డబ్బుకి ఎంతో విలువ ఇస్తాను. రెమ్యూనరేషన్‌ బాగా ఇస్తామంటే ఏ చిత్రంలోనైనా, చిన్న హీరోలతోనైనా నటించడానికి నేను రెడీ అని చెప్పింది. అయినా ఇప్పుడు ఆమె ఏమీ స్టార్‌ హీరోయిన్‌ కాదు కదా...! ఆమె కూడా ఇప్పుడిప్పుడే చిత్రాలు చేస్తోంది. మరి ఆమె ఏదో టాప్‌స్టార్‌ అన్నట్లుగా పారితోషికం బాగా ఇస్తే చిన్నహీరోల చిత్రాలలో కూడా నటిస్తానని చెప్పడం ఏమిటి? 'గుంటూరు టాకీస్‌, నెక్ట్స్‌ నువ్వే' వంటి చిత్రాలలో ఆమె చేసింది మరీ ప్రాధాన్యం ఉన్న పాత్రలేమీ కాదు. అందునా వాటిల్లో నటించిన హీరోలేమీ స్టార్స్‌ కాదు కదా...! అనే సందేహం మాత్రం అందరికీ కలుగుతోంది. 

Rashmi about Money Importance:

Rashmi Gives Clarity About Her Initial Days and life

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ