Advertisementt

సునీల్‌ కి రాజశేఖర్ అంటే ఎందుకిష్టమో తెలుసా?

Fri 10th Nov 2017 05:11 PM
sunil,rajasekhar,psv garudavega movie,sunil daughter,cake mixing party  సునీల్‌ కి రాజశేఖర్ అంటే ఎందుకిష్టమో తెలుసా?
Sunil Talks About Dr Rajasekhar and His PSV Garuda Vega Movie సునీల్‌ కి రాజశేఖర్ అంటే ఎందుకిష్టమో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రవీణ్‌సత్తార్‌.. ఆయన తీసిన చిత్రాలన్నీ ఒకదానితో మరోటి పోలిక లేని వివిధ జోనర్స్‌ చిత్రాలు. అయితే ఆయనకు కమర్షియల్‌ డైరెక్టర్‌గా, పెద్ద హీరోలను హ్యాండిల్‌ చేయగలడనే నమ్మకాన్ని మాత్రం 'పీఎస్వీగరుడవేగ' ఇచ్చింది. ఇక ఈచిత్రం హీరో రాజశేఖర్‌కి కమ్‌ బ్యాక్‌ మూవీగా నిలిచింది. దాంతో ఎంతో సంతోషంలో ఉన్న ఈ యూనిట్‌ పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ ఈవెంట్‌లో వీరు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలో హీరో కమ్‌ కమెడియన్‌ సునీల్‌ కూడా పాల్గొన్నాడు. 

ముందుగా సునీల్‌ ఈ చిత్రంతో విజయం సాధించిన రాజశేఖర్‌కి, యూనిట్‌కి అభినందనలు తెలిపాడు. ఆ తర్వాత మాట్లాడుతూ, నాకు హీరోగా రాజశేఖర్‌ ఫేవరేట్‌. ఆయన్ను హీరోగానే కాదు.. మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఆరాధిస్తాను. నా కుమార్తెకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆయన వైద్యం చేసి నా పాప ప్రాణాలను కాపాడారు అని ఉద్వేగంగా ప్రసగించాడు. ఇక ఈ యూనిట్‌తో కలసి క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ ఈవెంట్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. మరోవైపు సునీల్‌ ప్రస్తుతం కమెడియన్‌గా కూడా చేయడానికి రెడీ అయ్యాడు. 

అయితే తాజాగా ఆయనకు హీరోగా ఓ చిత్రం మిస్‌ అయిందని సమాచారం. ఓ తమిళ రీమేక్‌గా శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంకకృష్ణ ప్రసాద్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా ఓ చిత్రం చేయాలని భావించి ఆయనకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడట. కానీ నిర్మాతకు, సునీల్‌కి మద్య స్పర్దలు రావడంతో శివలెంక కృష్ణ ప్రసాద్‌ మహేష్‌ బావ సుధీర్‌బాబుని హీరోగా పెట్టుకుని చిత్రం చేస్తున్నాడు. 

Sunil Talks About Dr Rajasekhar and His PSV Garuda Vega Movie:

Hero Sunil Says Rajasekhar Saves My Daughter Life

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ