బుల్లితెరపైనే కాదు.. ఈమధ్యకాలంలో వెండితెరపై కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ రెచ్చిపోతోంది రష్మీ గౌతమ్. తాజాగా తాను నటించిన 'నెక్ట్స్‌నువ్వే' చిత్రంలోని 'గడ్డివాము దగ్గర కుక్క ఉంటుంది కదా..! తెలుసా?. అది తినదు.. వేరే వారిని తిననివ్వదు..' అనే డైలాగ్‌ని ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవచ్చని చెప్పింది. ఇందులో చీర కట్టుకని నటించడానికి ఎంతో కష్టపడ్డానని చెబుతోంది. ఇక తనకు రెజీనాలా ఉన్నావు. కీర్తిరెడ్డిలా ఉన్నావు అని రోజుకి 50 కాల్స్ వస్తుంటాయని, వారి కోసం తన వద్ద తిట్లు కూడా రెడీగా ఉంటాయని చెప్పింది.
ఇక మీ విషయంలో అసలు బయటి వారికి తెలియని విషయం ఏమైనా ఉంటే చెప్పండి అని ప్రశ్నిస్తే.. నేను టీ పెడితే ఎవ్వరు తాగవద్దని, నేను చేసే టీ కన్నా గోమూత్రం బాగుంటుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకు టీ పెట్టడం కూడా చేతకాదని, తనను చీరలో చూడాలని కోరుకోవద్దని ఈ భామ బాగానే ఇన్‌డెరెక్ట్‌గా చెబుతోంది. అయినా హిందువులకి గోమూత్రం ఎంతో పవిత్రం. అది ఆయుర్వేదంలో కూడా సకల రోగ నివారిణి, దానిని చాలా మంది సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మడు తాను పెట్టిన టీని గోమూత్రంతో కాకుండా 'గడ్డివాము దగ్గర ఉండే శునక మూత్రం'తో పోలిస్తే బాగుండేది కదా...!