Advertisementt

‘అజ్ఞాతవాసి’ అని స్టిల్స్ చెప్పేస్తున్నాయ్!

Mon 13th Nov 2017 12:19 AM
pawan kalyan,trivikram srinivas,pspk 25 stills,pawan agnathavasi  ‘అజ్ఞాతవాసి’ అని స్టిల్స్ చెప్పేస్తున్నాయ్!
Pawan Kalyan Latest Stills sensation in Social Media ‘అజ్ఞాతవాసి’ అని స్టిల్స్ చెప్పేస్తున్నాయ్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అంటే జనాలలో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకి అజ్ఞాతవాసి టైటిల్ అని ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అఫీషియల్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ ఫొటోస్  కనపడుతున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన ఈ ఫొటోలే. అయితే ఈ ఫొటోస్ ని కావాలనే చిత్ర బృందం ఇలా విడుదల చేసినట్టు తెలుస్తుంది. సినిమా పై భారీ  హైప్ పెంచేందుకే ఈ ఫొటోస్ సోషల్ మీడియా లోకి వదిలారు. విడుదల చేసిన ఫొటోస్ కు పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. మరి అజ్ఞాతవాసి టైటిల్ విడుదల చెయ్యకుండానే జనాల్లోకి ఎలా చొచ్చుకు పోయిందో... ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల PSPK 25 వర్కింగ్ స్టిల్స్ కూడా అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. 

ఇక ఈ స్టిల్స్ఈ పవన్ కళ్యాణ్ చాల స్టైలిష్ పైగా... కూల్ గా అందంగా కనబడుతున్నాడు. అజ్ఞాతవాసి టైటిల్ కి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలు.... స్నేహితుడు త్రివిక్రమ్ తో పవన్ ముచ్చట్లు ఇలా... అన్నిరకాలుగా ఆ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం యూరోప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 14న ఆడియో రిలీజ్ చేసి, జనవరి 10న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Pawan Kalyan Latest Stills sensation in Social Media:

Pawan Agnathavasi in PSPK25 Stills

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ