Advertisementt

నాగార్జునని కెలకనిస్తాడా..?

Mon 13th Nov 2017 12:27 AM
nagarjuna,ram gopal varma,hello movie,akhil  నాగార్జునని కెలకనిస్తాడా..?
Gossips on Nagarjuna and RGV Movie నాగార్జునని కెలకనిస్తాడా..?
Advertisement
Ads by CJ

ఏ హీరో అయినా తాను నటించే సినిమాలో ఎంతో కొంత జోక్యం చేసుకుంటారని మనకి తెలిసిన విషయమే. అయితే నాగార్జున ఈమధ్యన తన సినిమాల విషయంలో ఇన్‌వాల్వ్‌ అవడం, ఒక్కోసారి దర్శకుడి పనిలోను ఇంటర్‌ఫియర్‌ అవడం గురించి వార్తలు వస్తూనే వున్నాయి. అందుకు ఉదాహరణ 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలు.

రీసెంట్‌గా 'రాజుగారి గది 2' లో కూడా ఫైనల్‌ ఎడిట్‌ ని నాగే... డిసైడ్‌ చేసారట. సినిమాలో కొన్ని కీలకమైన కామెడీ సీన్స్ ని నాగ్ దగ్గర ఉండి మరీ ఎడిట్ చేయించాడనే టాక్ నడిచింది. ఈ కామెడీ సీన్స్ లేపెయ్యడంపై  కమెడియన్ షకలక శంకర్‌ చాలా బాధ పడిపోయాడు కూడా. ఈ విషయంపై నాగార్జుననే కూడా స్పందించాడు. నేను సినిమాలో కొన్నిఅతిగా ఉన్న సీన్స్ తీయించేశానని ఓపెన్ గానే చెప్పాడు నాగ్. అయితే ఓపెనింగ్స్‌ బాగా వచ్చినపుడు ఆ ఘనత తనదే అన్నట్టుగా మాట్లాడారు నాగ్.

ఇక తాజాగా తన కొడుకు నటిస్తున్న 'హలో' సినిమా విషయంలో కూడా నాగ్ ది అదే తీరు. ఇది ఇలా ఉండగా నాగ్ - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి కూడా నాగ్ పూర్తిగా వర్మ అధీనంలో వుంచుతాడా లేదా అన్నది చూడాలి. అయితే వర్మ కూడా అంత ఈజీగా అవతలి వారిని డామినేట్‌ చేయనివ్వడు కనుక ఈ కాంబినేషన్‌లో సినిమా ఖచ్చితంగా వార్తల్లో వుంటుందని ఆశించవచ్చు.

Gossips on Nagarjuna and RGV Movie:

Can Nagarjuna dominates RGV..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ