Advertisementt

బన్నీ లుక్ తెలిసిపోయిందిగా..!!

Tue 14th Nov 2017 03:55 PM
allu arjun,naga chaitanya,samantha,wedding reception,allu arjun look,naa peru surya naa illu india  బన్నీ లుక్ తెలిసిపోయిందిగా..!!
Allu Arjun Look in Naa Peru Surya Naa Illu India Movie బన్నీ లుక్ తెలిసిపోయిందిగా..!!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ఈ పేరు ఊరకే రాలేదు బన్నీకి. తన లైఫ్ స్టైల్ లో కానీ.. సినిమాల పరంగా కానీ స్టైల్ కి తగ్గట్టుగా ఉంటాడు బన్నీ. అందుకే అతనికి స్టైలిష్ స్టార్ అని బిరుదు వచ్చింది. ప్రతీ సినిమాకి తన స్టయిల్ ను కంప్లీట్ గా ఛేంజ్  చేసేస్తూ ఉంటాడు.

అయితే బన్నీ, వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా లో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ నా పేరు సూర్య లుక్ ని ఆగష్టు 15  కానుకగా అని ఒకసారి... దసరాకి అని ఒకసారి ప్రచారం జరిగినా ఆ లుక్  ఇంతవరకు బయటికి రాలేదు. అప్పటినుండి బన్నీ బయట కనబడింది లేదు. నా పేరు సూర్య కోసం మేకోవర్ అవుతున్న బన్నీ అనే క్యాప్షన్ తప్ప. అయితే తాజాగా నాగచైతన్య - సమంతల రిసెప్షన్ లో బన్నీఅందరి నోళ్ళలో హాట్ టాపిక్ అయ్యాడు. అదేంటి నాగచైతన్య - సమంతల రిసెప్షన్ అయితే బన్నీ ఎలా హాట్ టాపిక్ అవుతాడు అనుకుంటున్నారా.. నా పేరు సూర్య లో బన్నీ ఏ లుక్ లో ఉండబోతున్నాడో అనే విషయం ఈ రిసెప్షన్ పేరు మీద బయటికి వచ్చింది. 

కనిపించీ కనిపించకుండా ఉన్న గెడ్డం.. మిలిటరీ హెయిర్ కట్ చూస్తే.. 'నా పేరు సూర్య' సినిమా కోసమే ఈ లుక్ లో బన్నీ అని అందరూ అనేసుకుంటున్నారు. నా పేరు సూర్య చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న బన్నీ.. ఇప్పుడు అదే లుక్ తో పబ్లిక్ లోకి వచ్చి దర్శనమిచ్చాడు.

Allu Arjun Look in Naa Peru Surya Naa Illu India Movie:

Allu Arjun at Naga Chaitanya and Samantha Wedding Reception

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ