Advertisementt

కేతిరెడ్డి లక్ష్మీపార్వతి ఈ హీరోయిన్నేనా?

Wed 15th Nov 2017 02:07 PM
lakshmi rai,ntr,biopic,lakshmi veeragramdham  కేతిరెడ్డి లక్ష్మీపార్వతి ఈ హీరోయిన్నేనా?
Lakshmi Rai For NTR Biopic కేతిరెడ్డి లక్ష్మీపార్వతి ఈ హీరోయిన్నేనా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్‌పై నాలుగు బయోపిక్‌లు రూపొందుతున్నాయి. తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రను తానే చేస్తూ తేజ దర్శకత్వంలో బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య చేస్తాడనే విషయం తప్ప మరే విషయం బయటకురావడం లేదు. మరోవైపు రాంగోపాల్‌వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పేరుతో ఈ చిత్రం కోసం ప్రీప్రొడక్షన్‌ పనులను మొదలుపెట్టాడు. ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను తనకు ఇస్తే నటిస్తానని వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌ బ్రాండ్‌, నాటి స్టార్‌ హీరోయిన్‌ రోజా తెలిపింది. ఇక ఎన్టీఆర్‌ పాత్ర కోసం ఓ వ్యక్తిని ఎంపిక చేసుకుని శిక్షణ కూడా ఇస్తున్నానని వర్మ ప్రకటించాడు. బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఆయన గొప్పతనాన్ని మాత్రమే చూపిస్తారని, వర్మ చిత్రంలో ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మిపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలు ఉంటాయని వర్మ అంటున్నాడు. 

ఇక ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలపై చాలా మందికి అవగాహన ఉంది. కానీ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మాత్రం ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్వీపార్వతి ఎంటర్‌ కాకముందు ఆమె వీరగంధం సుబ్బారావుకి భార్య అని, హరికథా కళాకారిణి అని మాత్రమే తెలుసు తప్ప లక్ష్మీపార్వతి పూర్వ చరిత్ర దాదాపు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. దాంతో కేతిరెడ్డి కూడా తన చిత్రానికి మంచి ఆదరణ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో లక్ష్మీపార్వతి పాత్రలో నటించడానికి నాటి నటి, తెలుగుదేశంలో చేరుతున్న వాణి విశ్వనాధ్‌ ఓకే చెప్పింది. కానీ కేతిరెడ్డి తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఓ మహిళ వీపుని చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. 

తాజా సమాచారం ప్రకారం కేతిరెడ్డి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'లో లక్ష్వీపార్వతి పాత్రకు సెక్స్‌ బాంబ్‌ రాయ్‌లక్ష్మిని తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రం తొలి షాట్‌ని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చిత్రీకరిస్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు. లక్ష్మీపార్వతి తన అనుమతి లేకుండా తన కథను ఎలా తీస్తారని హెచ్చరిస్తోంది. దానికి ధీటుగా కేతిరెడ్డి కూడా ఓపెన్‌ బ్యాలెట్‌కి సిద్దమని, లక్ష్మీపార్వతి మంచిదా? కాదా? అనే పోల్‌ పెడదామని అందులో 10శాతం మంది ఆమె మంచిదని చెబితే సినిమాను విరమించుకుంటానని అన్నాడు. 

ఇక ఈ చిత్రం కథాంశం ఓ సాధారణ మహిళ ఓ మహానటుడిని, సీఎంని సైతం ఎలా ట్రాప్‌లో పడవేసింది? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుందట. ఇక తాజాగా రామసత్యనారాయణ అనే నిర్మాత కూడా ఎన్టీఆర్‌పై చిత్రం చేస్తానని చెప్పాడు. ఇక కేతిరెడ్డి వీరగంధం సుబ్బారావుగా ఎవరిని తీసుకుంటాడు? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

Lakshmi Rai For NTR Biopic:

Sexy Heroine For NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ