Advertisementt

సాయిధరమ్ లో ఈ క్వాలిటీ కూడానా..!

Thu 16th Nov 2017 02:14 PM
sai dharam tej,sundeep kishan,rahul ravindran,aadhi sai kumar,good quality  సాయిధరమ్ లో ఈ క్వాలిటీ కూడానా..!
Sundeep Kishan Praises Sai Dharam and Rahul Ravindran సాయిధరమ్ లో ఈ క్వాలిటీ కూడానా..!
Advertisement
Ads by CJ

నేటితరం హీరోలైన నారారోహిత్‌, సాయిధరమ్‌తేజ్‌, సందీప్‌కిషన్‌, ఆది సాయికుమార్‌, శ్రీవిష్ణు, నాగశౌర్య, సుధీర్‌బాబు వంటి వారు ఎంతో క్లోజ్‌గా మూవ్‌ అవుతూ ఉంటారు. వారి చిత్రాలలో కలిసి నటించాల్సి వస్తే కూడా నటిస్తున్నారు. ఒకరినొకరు అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ప్రతి ఒక్కరు మరొకరి వేడుకలకు, విషెష్‌ని తెలియజేసుకుంటూ వస్తున్నారు. వీరిని చూసిన స్టార్స్‌లో ఇప్పుడిప్పుడే మంచి మార్పు కనిపిస్తోంది. ఒకరిని ఒకరు బెస్ట్‌ విషెష్‌ చెప్పుకోవడం, ఒకరి వేడుకలకు మరొకరు వస్తున్నారు. ఇక వీరు కలిసి సినిమాలలో కూడా నటిస్తే నిజమైన మల్టీస్టారర్స్‌ వస్తాయి. 

తాజాగా సందీప్‌కిషన్‌... సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, ఆది సాయికుమార్‌, రాహుల్‌రవీంద్రన్‌ వంటి వారిపై గొప్పగా వ్యాఖ్యలు చేశాడు. నాకు నాడు సాయిధరమ్‌తేజ్‌ పెద్దగా పరిచయం లేదు. కానీ ఆయన నేను ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే ఎంతో హెల్ప్‌ చేశాడు. ఆ సాయం సాయి చేయకపోతే నేనేమైపోయేవాడినో. ఇక ఆయన నేను మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఎంతో సాయం చేశాడు. సాయి అంటే నాకు ప్రాణం. నా నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా ఆయన నాకు సహాయం చేశాడు. 

ఇక రాహుల్‌ రవీంద్రన్‌ అయితే జెమ్‌. అలాంటివారు పుట్టడం అరుదు. చాలా మంచి మనిషి, నికార్సయిన మనిషి, ఎవ్వరికీ చెడు చేయాలని భావించడు. బాగా సాయం చేస్తాడు. ఏ విషయాన్ని అతను నెగటివ్‌గా తీసుకోడు. ఇక ఆది సాయికుమర్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను కృష్ణవంశీ గారితో చేసిన 'నక్షత్రం' తర్వాత అన్నింటిని పాజిటివ్‌గా తీసుకోవడం నేర్చుకున్నాను... అని చెప్పాడు. ఇక కృష్ణవంశీ 'నక్షత్రం'లో సాయిధరమ్‌తేజ్‌.. సందీప్‌కి అండగా ఓ అతిధి పాత్రను చేసిన సంగతి తెలిసిందే. 

Sundeep Kishan Praises Sai Dharam and Rahul Ravindran:

Sundeep Kishan Reveals Sai Dharam Tej Good Quality

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ