Advertisementt

'హలో'....అఖిల్..!

Fri 17th Nov 2017 01:28 PM
akhil.hello movie,hello movie teaser,vikram k kumar  'హలో'....అఖిల్..!
Hello Movie Teaser Review 'హలో'....అఖిల్..!
Advertisement
Ads by CJ

విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని.. తండ్రి నాగార్జున నిర్మాణంలో  'హలో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ ని నాగార్జున సినిమా ఇండస్ట్రీకి  రీ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ కూడా 'అఖిల్' తో... చాలా గ్యాప్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుదాం అనే ఉద్దేశ్యంతో.. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన కొత్తమ్మాయి కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. మొన్నామధ్యన 'హలో' ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మంచి అంచనాలు పెంచిన చిత్ర బృదం తాజాగా 'హలో' టీజర్ ని కూడా వదిలింది.

హాలీవుడ్ సినిమాలను మరిపించే విజువల్స్ తో, స్టెంట్స్  తో అఖిల్ కుమ్మేశాడు. ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. నాగార్జున వాయిస్ ఓవర్ అందించిన 'హలో' టీజర్ ని చూస్తే.. నాగార్జున వాయిస్ ఓవర్ లో చెప్పినట్టే.. ఇద్దరు స్నేహితులు చిన్నప్పుడే అనుకోని కారణాలతో విడిపోయి... పెరిగి పెద్దవారయ్యాక తమ సోల్మెట్స్ ని వెతుక్కోవడం అనే కాన్సెప్ట్ తోనే సినిమా కథ నడుస్తుందనేది మాత్రం అర్ధమవుతుంది. ఈ టీజర్ కి ప్రధాన ఆకర్షణ మాత్రం యాక్షన్ సన్నివేశాలే. 'హలో' యాక్షన్ సీన్స్ లో అఖిల్ కట్లు విప్పుకుని బిల్డింగ్ మీద నుండి అవలీలగా దూకెయ్యడం.. అలాగే బైక్ చేజులూ.. పరిగెత్తించడం, లారీ మీదకెక్కి జంప్ చెయ్యడం.. హాలీవుడ్ సినిమాలను తలపిస్తూ మెయిన్ హైలెట్ గా కనబడుతున్నాయి. అంతేకాకుండా 'హలో' లో ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా స్పష్టంగా కనబడుతుంది. రమ్యకృష్ణ, జగపతి బాబు ల లుక్స్, హీరోయిన్ కళ్యాణి లుక్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా వుంది.  అనూప్ కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో 'హలో' టీజర్ కు మరింత ఊపుని తెచ్చాడు. అయితే ఈ టీజర్ లో అఖిల్ కి సింగల్ డైలాగ్ ( అది కూడా 'హలో' అనే డైలాగ్ ) వుండటం తన ఫాన్స్ ని కొంచం నిరాశపరిచింది. 

టీజర్ అమాంతం ఆకట్టుకునేలాగా కనబడుతుంది. ఇందులో విక్రమ్ దర్శకత్వం ఏ రేంజ్ లో ఉండబోతుందో... అలాగే నాగార్జున ఎంత భారీగా ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నాడో.. అంతేకాకుండా ఈ సినిమాకు పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ మాత్రం నిజంగా వండర్ అనిపించేలా వున్నాయి. మొత్తానికి అఖిల్ 'హలో' తో డిసెంబర్ 22న గట్టిగా కొట్టేలాగే కనబడుతున్నాడు.

Click Here See The HELLO Movie Teaser

Hello Movie Teaser Review:

Akkineni Akhil new movie HELLO Director by Vikram K Kumar this movie Teaser Released Today.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ