ముందు పొట్టా వెనుకబట్టా వేసుకున్న ప్రతి ఒక్కడు రివ్యూలు రాస్తున్నారని హైపర్ ఆది కత్తిమహేష్‌పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. కాగా దానికి కూడా కత్తిమహేష్ కత్తిలాంటి ఆన్సర్స్ ఇస్తూ 'జబర్దస్త్'షోని కూడా ఏకిపారేశాడు. అయినా ఈ వివాదం ఇంకా ఆగిపోలేదు. తాజాగా హైపర్ ఆది మాట్లాడుతూ, కత్తి మహేష్‌కి సెలబ్రిటీ కావాలని ఎంతో కోరిక ఉందని, ఆయన ఓకే అంటే తన 'జబర్దస్త్' స్కిట్‌లో ఓ వేషం ఇస్తానని, ఆయనలోని కామెడీ యాంగిల్‌ని కూడా వాడుకుంటానని కామెంట్ చేశాడు. పెసరట్లు, ఇడ్లీలు, దోసెలు వేసే రాజేష్‌ని అవి వేయకురా అంటే ఊరుకోడని అవి వద్దురా బాబూ అన్నా కూడా ఒప్పుకోకుండా సోషల్‌మీడియాలో ఏదేదో వాగుతుంటాడని అన్నాడు. అంతేకాదు.. పవన్‌పై విమర్శలు చేసే అర్హత కత్తిమహేష్‌కి లేదని, ఇంగ్లాండ్ వాళ్లు గుర్తించి గౌరవించే వ్యక్తిని, మనం గుర్తించకపోవడం ఏమిటి? అంటూ రైజ్ అయ్యాడు.
అంతేగాక సినిమా తీయడం ఎంత కష్టమో తెలియని కత్తి మహేష్ అవి బాగున్నాయో లేదో చెప్పడానికి ఆయనెవరు? అంటూ విరుచుకుపడ్డాడు. తన షోని కోట్లలో చూస్తుంటే కత్తి మహేష్‌ని లక్షల్లోనే చూస్తున్నారని చెప్పాడు. ఇక మరలా వెంటనే తాజాగా జరిగిన ప్రీమియర్ షోలో కత్తిని చూశానని, ఆయన క్యూట్‌గా ఉన్నాడని ఎద్దేవా చేశాడు. ఇక ఓ ప్రీమియర్ షో సందర్భంగా హైపర్ ఆది, కత్తిమహేష్‌లు కలిసి ఫొటో తీసుకున్నారు. దానిని చూపిస్తూ కత్తి మహేష్ మేము మేము బాగానే ఉంటాం. మద్యలో ఫ్యాన్స్ ఎదవలైపోతారని కామెంట్ చేశాడు. ఇందులో ఎంతో వాస్తవం ఉంది. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వాదులాడుకుని చంపుకుంటుంటే పవన్ ఎన్టీఆర్ చిత్రానికి వెళ్లి క్లాప్ కొట్టాడు. నిజానికి పెద్దలందరూ ఒకటే. కానీ మద్యలో నాశనమైయేది అభిమానులే.
ఇక కత్తి మహేష్.. పవన్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి, కమ్మవారు ఇచ్చే అవార్డులు మీకెందుకు? పవన్ వచ్చి కాపు రాజ్యం తెస్తే అప్పుడు అవార్డులన్ని పప్పు బెల్లాలుగా పంచుకోవచ్చు అని సెటైర్ విసిరాడు. దీనిపై హైపర్ ఆది ఓ టీవీ లైవ్ షో లో పాల్గొని కత్తి ని ఏకిపారేశాడు. ఇలా నడుస్తుంది వీరి వ్యవహారం. మరి ముందు ముందు ఈ యవ్వారం ఎంతదూరం వెళుతుందో మరి?