ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలు జగన్‌కి వ్యతిరేకం కావచ్చు. చంద్రబాబుకి అనుకూలం కావచ్చు. కానీ ఎండీ రాధాకృష్ణ మాత్రం బెదిరింపులకు లొంగని మనిషి, నేనూ తెలంగాణ వాడినే, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ఆయన కేసీఆర్‌పై తూటాలు పేల్చాడు. ఇక రామోజీరావు అయినా జగన్ తనని కలిసిన తర్వాత తన మీడియాలో ఆయనకు ఎంతోకొంత ప్రాధాన్యం ఇస్తున్నాడేగానీ రాధాకృష్ణ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇక తాజాగా ఆయన నంది అవార్డులపై జరిగిన ఓపెన్ డిబేట్‌లో ఆయన బన్ని వాసుకి ఇచ్చిన కౌంటర్ దిమ్మతిరిగేలా చేసిందని చెప్పవచ్చు. కులం కుళ్లురా, మతం మత్తురా అన్నట్లు.... కులం కూడు పెట్టదు.. మతం మనిషిని ఎల్లకాలం బతికేలా చేయలేదు. ఈ విషయంలో ఎవరైనా సరే ఏకీభవించాల్సిఉంది.
స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలమైనా, ఈ టెక్నాలజీ రోజుల్లో కూడా కుల మతాల మధ్య గొడవలు పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. ఇక విషయానికి వస్తే ఈ ఓపెన్ డిబేట్‌లో బన్నీవాసు ఓవర్ చేశాడు. మా చిరంజీవికి, మా మెగా ఫ్యామిలీకి 2002 నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. రికమండేషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పదే పదే మా చిరంజీవి, మా మెగాఫ్యామిలీ అన్నాడు. దాంతో రాధాకృష్ణ 'చిరంజీవి మా వాడు.. మా చిరంజీవి, మా మెగాఫ్యామిలీ అని మాట్లాడవద్దు. అది చిరంజీవికే నష్టం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కమ్మవారి కడుపు నిండదు.. చిరంజీవి సీఎం అయితే కాపులకి కడుపునిండదు' అని కౌంటర్ ఇచ్చాడు. దీనిపై కొందరు మెగాభిమానులు మాత్రం కుల పిచ్చి ఉన్న రాధాకృష్ణ నీతులు చెప్పడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శిస్తున్నారు.
కానీ మంచిని మంచి అని చెడుని చెడు అని చెప్పుకోవాలి. ఆర్కే తప్పులు ఉంటే ఖండిద్దాం. అలాగని ఆయన మంచి మాట్లాడినా విమర్శలు చేయడం సరికాదు. చిరంజీవి, పవన్‌లను ఆ కులం వారు మావాడు మావాడు అనడం వల్ల న్యూట్రల్‌గా ఉండే వారు కూడా అమ్మో పవన్ వస్తే కాపు పెత్తనం పెరిగిపోతుందేమో, చంద్రబాబు అయితే కమ్మ పెత్తనం చెలాయిస్తాడనే భయభ్రాంతులు వ్యాపిస్తాయి. సినీ నటులకు, ముఖ్యంగా రాజకీయాలలోకి రావాలనే వారికి ఇలాంటి బన్నీ వాసు వంటి మాటలు చెడునే చేస్తాయి. ఆర్కే చెప్పినట్లు చిరంజీవి అందరివాడు. కానీ ఆయన్ను కొందరి వాడిగా ఆయన వాళ్లే నాశనం చేస్తున్నారు.