Advertisementt

చరణ్, బోయపాటి సినిమాకి ముహూర్తం ఫిక్స్!

Tue 21st Nov 2017 09:40 PM
ram charan,boyapati,janavary,ram charan and boyapati film,sukumar  చరణ్, బోయపాటి సినిమాకి ముహూర్తం ఫిక్స్!
Ram Charan, Boyapati Srinu film from January చరణ్, బోయపాటి సినిమాకి ముహూర్తం ఫిక్స్!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇంకొంత షూటింగ్ తో పాటే మరో నాలుగు పాటల షూటింగ్ ఇంకా మిగిలి ఉందనే.. న్యూస్ ఉంది. అయితే వచ్చే డిసెంబర్ కల్లా రంగస్థలం షూటింగ్ కంప్లీట్ చేసేసి.. జనవరి, ఫిబ్రవరి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కేటాయించి మార్చిలో సినిమాని విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇకపోతే సుకుమార్ తర్వాత రామ్ చరణ్, కొరటాలశివ దర్శకత్వంలో నటిస్తాడని అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాను అఫీషియల్ గా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు కాబట్టి. 

కానీ రామ్ చరణ్ మాత్రం సుకుమార్ సినిమా తర్వాత కొరటాల సినిమా స్థానంలో మరో ప్రాజెక్టు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆ కాంబినేషన్ కూడా అలాంటిలాంటి కాంబినేషన్ కాదు... మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో చరణ్ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను కూడా 'జయ జానకి నాయక' తర్వాత ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. వీలయితే బాలయ్యతో సినిమా చేయాలని అనుకున్న బోయపాటికి ఇప్పుడు తాజాగా మెగా హీరో రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఇంకేంటి బోయపాటి, రామ్ చరణ్ ల సినిమా సుకుమార్ సినిమా తర్వాత అని అందరూ ఫిక్స్ అయ్యారు కూడా.

మరి నిజానికి బోయపాటితో సినిమా ఉంటుందనే విషయాన్ని కూడా రామ్ చరణ్ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అసలు మెగా కాంపౌండ్ నుండి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ - బోయపాటి సినిమాకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. చెర్రీ - బోయపాటిల సినిమా ఈనెల 26న ప్రారంభం అవుతుందని సమాచారం. జనవరి 1 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని... 6 నెలల్లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Ram Charan, Boyapati Srinu film from January:

Ram Charan And Boyapati Movie Would Kickstart Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ