Advertisementt

చిరు అండ్ చరణ్.. సేమ్ టు సేమ్..!

Thu 23rd Nov 2017 06:28 PM
ram charan,coffee time,chiranjeevi,beard and dress,attire  చిరు అండ్ చరణ్.. సేమ్ టు సేమ్..!
Chiranjeevi and Ram Charan: Same Beard and Same Outfits చిరు అండ్ చరణ్.. సేమ్ టు సేమ్..!
Advertisement
Ads by CJ

రంగస్థలం కోసం రామ్ చరణ్ ఎప్పటినుండో గుబురు గెడ్డాన్ని మెయింటింగ్ చేస్తున్నాడు. రంగస్థలం షూటింగ్ పూర్తయ్యేవరకు రామ్ చరణ్ కి ఆ పరిస్థితి  తప్పదు. ఇక రంగస్థలం షూటింగ్ అలా కంప్లీట్ కాగానే ఇలా రామ్ చరణ్ గెడ్డం తీసేసి హ్యాండ్సమ్ లుక్ లో మారిపోతాడు. అయితే ఇప్పడు చిరంజీవి కూడా గుబురు గెడ్డం పెంచేశాడు. ఎందుకంటే చిరంజీవి తన 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' కోసం గుబురు గెడ్డంలోనే కనబడాలి. ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'సై రా' కోసం చిరు దాదాపు ఏడాది పాటు గెడ్డం పెంచాలి.

ఇక 'సై రా నరసింహారెడ్డి' పది పదిహేను రోజుల్లో సెట్స్ మీదకెళ్లబోతుంది. అందుకే చిరు లుక్ టోటల్ గా చేంజ్ అవుతుంది. అందులో భాగంగానే చిరు గెడ్డం పెంచేశాడు. అయితే తండ్రి కొడుకులు ఈ గుబురు గెడ్డంతో చాలా చూడముచ్చటగా కనబడుతున్నారు. ఈ పిక్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఒకే రకమైన గెడ్డంతో పాటే.... ఒకే రకమైన డ్రెస్సులో కనబడుతున్నారు. వీరిద్దరూ ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఇలా ఒకేరకమైన గెటప్స్ లో కనబడ్డారు. ఆ కాఫీ తాగుతూ తండ్రి కొడుకులిద్దరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక తండ్రి కొడుకుల గెడ్డం పిక్స్ ని రామ్ చరణే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటోతోపాటే.. ఇది కాఫీ టైమ్ అని..... గెడ్డంతో నేను డాడీ సేమ్ టు సేమ్ కనిపిస్తున్నాం. కాఫీ కోసం బయటకి తీసుకెళ్లడానికి నాన్నని ఒప్పించడం చాలా ఆనందంగా ఉంది.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

Chiranjeevi and Ram Charan: Same Beard and Same Outfits:

Here is a rare pic of sorts which can easily be treated as one of the best pics of Megastar Chiranjeevi and Mega Power Star Ram Charan who are seen together.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ