స్వచ్చమైన వైజాగ్ తెలుగమ్మాయి గౌతమి. ఆమె మొదటగా రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించి ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా సౌతిండియాలోని పలు భాషల్లో నటించింది. ఈమెకి చిన్ననాటి నుంచి సినిమాలలోకి వచ్చేవరకు బయటి ప్రపంచం తెలియదు. కేవలం స్కూల్, ఇంటినే ప్రపంచంగా, నాలుగోడల మధ్యన తన తల్లిదండ్రులు, అన్నయ్యలే జీవితంగా భావించింది. ఆమె తండ్రి తోటి క్లాస్‌మేట్స్‌తో కలిసి ఉండాలని, వారితో ఆటలు పాటల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఆమెను చిన్ననాడు తానే వెంటపెట్టుకుని ఆమె స్నేహితుల ఇళ్లకు తీసుకుని పోయేవారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశం వచ్చినా ఆమె తల్లి లేకుండా షూటింగ్‌లకి వచ్చేది కాదు. ఇది నాటి సినీ జనాలకి బాగా తెలుసు. అలాంటి ఆమె తన తల్లి చనిపోవడంతో మనస్తాపానికి గురైంది. కమల్‌హాసన్ కళ్లు ఆమెపై పడ్డాయి. అంతకు ముందే ఆమెకు కమల్‌హాసన్ ఉమనైజర్ అని, విశృంఖల భావాలు ఉన్న స్వార్థపూరితమైన మనిషి అని కొందరు చెప్పినా ఆమె ఆయన వలలోనే పడిపోయింది.
అంతకు ముందే కమల్‌కి వాణిగణపతి, సారికలు కమల్ వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడిన విషయం తెలుసు. స్వయంగా ఆమెకు ఎన్నో జాగ్రత్తలను వాణిగణపతి, సారికలు తమనే ఉదాహరణగా తీసుకోమని చెప్పినా సావిత్రి గుడ్డిగా జెమినీ గణేషన్‌ని నమ్మినట్లు గౌతమి కమల్‌ని నమ్మింది. శృతిహాసన్, అక్షరహాసన్‌లను తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవడమే కాదు... వారి దగ్గర తల్లి లేదని తానే వారికి కన్నతల్లి అయి, తనకు పిల్లలు వద్దనుకునే స్థాయికి వెళ్ళింది. ఇంత బిడియస్తురాలు, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువతి, తల్లి కొంగు చాటు బిడ్డ, లోకం తెలియని ఆమె కమల్‌తో వివాహం చేసుకోకపోయినా ఫర్వాలేదు.. సహజీవనమైనా చేద్దామని కమల్‌తోనే జీవితం అని నిర్ణయించుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు కూడా వుంది. ఇక ఆమెకి క్యాన్సర్ వస్తే కమల్‌తో పాటు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తన మనోధైర్యంతోనే దానిని జయించింది. ఇలా వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా, పిల్లలు లేక, భవిష్యత్తులో చూసుకునే వారు లేక కమల్‌తో విబేధాల వల్ల జీవితం, డబ్బు అన్ని పొగొట్టుకుంది.
ఆమె తాజాగా మాట్లాడుతూ, నా తల్లి మరణించిన తర్వాతే నాకు లోకం తెలిసింది. మానసికంగా ఎదగడం మొదలైంది. ప్రపంచం అంటే ఏమిటి? ఎవరు ఎలా మాట్లాడి వశపరుచుకుంటారు? ఎవరు మనసులో ఏమి పెట్టుకుని ఏమి మాట్లాడుతారు? వంటి విషయాలన్ని తెలిశాయని ఒప్పుకుంది. మనుషులు ఎలా ఉంటారు? లోపల ఏమి పెట్టుకునివుంటారనేది నేను తెలుసుకుని, నా దారి నేను చూసుకునే సరికి చాలా కాలం పట్టింది.. అని ఒప్పుకుంది. ఇప్పటికైనా ఆమె ప్రపంచం తెలుసుకున్నందుకు సంతోషం. యువతులను, మరీ ముఖ్యంగా సినీ ఫీల్డ్‌లో హీరోయిన్లు, ఇతర నటీమణులను ఎలా తడి గుడ్డలతో గొంతు కోస్తారో అందరికీ తెలిసిందే. మరీ సావిత్రిలాగా కాకుండా ఇకనైనా ఆమె సరైన దారిలో పయనిస్తుందని ఆశిద్దాం...!