Advertisementt

బన్నీపై భజన మొదలెట్టేశాడు..!

Mon 27th Nov 2017 04:50 PM
vakkantham vamsi,allu arjun,praises,direction,naa peru surya naa illu india  బన్నీపై భజన మొదలెట్టేశాడు..!
Vakkantham Vamsi Praises Allu Arjun బన్నీపై భజన మొదలెట్టేశాడు..!
Advertisement
Ads by CJ

రైటర్ గా మంచి సినిమాలకి కథలందించిన వక్కంతం వంశీ ఎప్పటినుండో దర్శకుడిగా లాంచ్ అవ్వాలనే ప్రయత్నాల్లో.. తన స్నేహితుడు స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ని పట్టుకుని కూర్చున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇదిగో అదిగో అంటూ వక్కంతాన్ని దర్శకుడు కాకుండా అడ్డుపడడంతో.. వంశీ మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు. అక్కడ ఎనర్జిటిక్  హీరో అల్లు అర్జున్ కి కథ చెప్పి ఇంప్రెస్ చెయ్యడమే కాదు.... అల్లు అర్జున్ హీరోగా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

అల్లు అర్జున్ - వక్కంతం కాంబినేషన్ లో  'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుంది. అయితే మొదటిసారి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ గురించి వంశీ వక్కంతం మాట్లాడుతూ.. తన కాన్ఫిడెన్స్ కు కారణం అల్లు అర్జునేనని, అల్లు అర్జున్ అన్ని విధాలా సహకరిస్తూ మంచి సపోర్ట్ అందిస్తున్నాడని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో డేరింగ్ హీరోలుగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అల్లు అర్జున్ ఒకడు అని తెగ పొగిడేశాడు.

అంతే కాకుండా అల్లు అర్జున్ లాంటి హీరోతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని వంశీ, అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసాడు. ఇక నా పేరు సూర్య  కోసం బన్నీ సరికొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా షూట్ చేసిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని  అల్లు అర్జున్ ఎటువంటి డూప్స్ లేకుండా చేశాడని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా... సీనియర్ హీరోలు శరత్ కుమార్ ఇంకా యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారు.

Vakkantham Vamsi Praises Allu Arjun:

Director Vakkantham Vamsi About His First Movie Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ