Advertisementt

'హలో' అమ్మకంలో నాగ్ నో కాంప్రమైజ్!

Wed 29th Nov 2017 08:27 PM
hello movie,nagarjuna,akhil,akhil business  'హలో' అమ్మకంలో నాగ్ నో కాంప్రమైజ్!
Nagarjuna No Compromise in Hello Business 'హలో' అమ్మకంలో నాగ్ నో కాంప్రమైజ్!
Advertisement
Ads by CJ

అఖిల్ సినిమాతో లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఒక రకంగా అఖిల్ కి మంచే జరిగిందా.? అంటే ఏమో తెలియదు గాని.... అఖిల్ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అయిన అఖిల్ కి ఆ సినిమాతో అనుకోని ప్లాప్ అందుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రీ లాంచ్ అవుతున్నాడు. నాగార్జున నిర్మాణంలో హలో సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. అఖిల్ సినిమా ప్లాప్ అయినప్పటికీ... ఆ ఛాయలేమి హలో సినిమా మీద పడినట్టుగా అనిపించడం లేదు. ఎందుకంటే హలో సినిమాకి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది.

నాగార్జున హలో సినిమాని తన ఓన్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పైనే నిర్మిస్తున్నాడు. అందుకే తాను చేస్తున్న సినిమాని కూడా పక్కన పెట్టేసి అఖిల్ హలో సినిమా బిజినెస్ వ్యవహారాలను కూడా తనే స్వయంగా డీల్ చేసుకుంటున్నాడు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హలో కి సంబంధించిన బిజినెస్  బావున్నా.. అటు డిజిటల్ హక్కులకు, శాటిలైట్ హక్కులకు రేటు తెగడం లేదంటున్నారు. నాగార్జున తన వ్యాపార తెలివితేటల్ని ఇక్కడ చూపిస్తున్నాడనే టాక్ నడుస్తుంది. పలు కంపెనీలతో ఎంతగా చర్చిస్తున్న ఈ డీల్స్ తెగడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నాగ్ హలో సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదట.

మరి నాగ్ చెప్పిన రేటు పెట్టడానికి వారు వెనుకాడుతున్నారని టాక్. వాళ్ళు అఖిల్ మొదటి సినిమా అఖిల్ ప్లాప్ ని దృష్టిలో పెట్టుకుని రేటు అడుగుతుంటే.. నాగ్ మాత్రం అఖిల్ ప్లాప్ ని పూర్తిగా మరిచిపోండి. ఇప్పుడు అఖిల్ హలో సినిమా అదిరిపోతుందని చెబుతున్నాడట. మరి స్టార్ హీరోల రేంజ్ లో శాటిలైట్ హక్కులని అమ్మాలని నాగ్ చూడడం కరెక్ట్ కాదేమో.. ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుందంటున్నారు కొందరు.

Nagarjuna No Compromise in Hello Business :

Nag Demands High Rates to Hello Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ