పవన్ - కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చివరి షెడ్యూల్ వారణాసిలో జరుగుతుంది. ఇప్పటికే హీరోయిన్స్ కి సంబందించిన షూటింగ్ పూర్తికావడంతో.. ఈ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ లు తమ తమ పాత్రలకు తమ సొంత గొంతుతోనే డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారు. సినిమా విడుదలకు ఆట్టే.. టైం లేకపోవడంతో.. సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. జనవరి 10 న విడుదలవుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో వేడుకకి తేదీ ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది.
అయితే అజ్ఞాతవాసి ఆడియో వేడుక కోసం డిసెంబర్ 18.. 19 అని రెండు డేట్స్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 18న ఆదివారం కావడంతో.. అదే రోజున ఆడియో లాంఛ్ చేయాలని నిర్ణయించారు. అయితే.. పర్మిషన్స్ విషయంలో ఏదైనా ఆలస్యం జరిగితే.. అనే ఉద్దేశ్యంతో సేఫ్ సైడ్ గా 19వ తేదీ అని కూడా అనుకుంటున్నారట. ఇకపోతే అజ్ఞాతవాసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమా కోసం ఐదు పాటలను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకపాటని ఇంతకూ ముందే మార్కెట్ లోకి వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతేకాకూండా అజ్ఞాతవాసిలో ఒక పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినట్లుగా ప్రచారం జరిగింది. ఇకపోతే ప్రి రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ కి కూడా అదిరి పోయే రేటొచ్చిన విషయం తెలిసందే.