నేటితరం యువత మరీ ముఖ్యంగా యువతులు ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటున్నారు. మగాళ్లయినా కాస్త సిగ్గుపడుతున్నారే గానీ ఆడవారు సిగరెట్లు, మద్యం, సెక్స్... ఇలా దేనికి భయపడటం లేదు. మగాళ్లు కేవలం పిల్లలని కనడానికే పనికి వస్తారని, పెళ్లికి ముందు సెక్స్ తప్పేకాదని, మా బాడీని మేమిష్టం వచ్చినట్లు చూపించుకుంటాం.. మా ఇష్టం వచ్చిన డ్రస్‌లు వేస్తాం.. అంటూ మగాళ్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని, ఆడాళ్లు తమను తాము ప్రేమించుకుంటూ ఇలా చేస్తుంటే మగాళ్లు తప్పుగా చూస్తున్నారని అంటున్నారు. ఇక ఈ విషయంలో సినీ నటీమణులు మరో రెండాకులు ఎక్కువే చదివారు. వారు చేసే ఫొటోషూట్స్, సోషల్‌మీడియాలో వారు పోస్ట్ చేసే శృంగార ఫొటోలు ఓ రేంజ్‌లో సంచలనాలను సృష్టిస్తున్నాయి.
ఇక వీరందరిలో అమలాపాల్ మరింత ముందు ఉంటుంది. ఎ.ఎల్. విజయ్‌ని వివాహం చేసుకుని మూడ్నాళ్ల ముచ్చటగా చేసి విడాకులు తీసుకుంది. మరోవైపు ధనుష్‌తో ఎఫైర్ నడుపుతోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈమె తెలుగులో నటించిన చిత్రాలలో కాస్త పద్దతిగానే కనిపించింది. తన కెరీర్ మొదట్లో కూడా గ్లామర్ ఆరబోతలో ఆచితూచి అడుగులు వేసింది. కానీ ఆ తర్వాత తన పవరేంటో చూపిస్తోంది. 'మైనా' చిత్రంలో కొండవాసిగా కనిపించింది. 'చిందు చమవెలి' చిత్రంలో మేనమామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పాత్రలో రెచ్చిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇక తాజాగా ఆమె బాబీసింహ, ప్రసన్నలతో కలిసి నటించిన 'తిరుట్టుప్పయల్ 2'లో రెచ్చిపోయి నటించింది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ. ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలలో నటించడానికి నేనేమి సంశయించలేదు. నిస్సంకోచంగా, బిడియం లేకుండా నటించాను. ఈ చిత్రంలో నేను చేసిన ఈ గ్లామర్‌షోకి ఇంత ప్రచారం వస్తుందని ఊహించలేదు. అదంతా నా అదృష్టం. కానీ ఈ సీన్స్‌లో నటించడానికి పాపం జయసింహనే ఎంతో ఇబ్బంది పడి, నెర్వస్‌గా ఫీలయ్యాడని దాన్నేదో గ్రేట్‌గా చెప్పుకుంది. ఇక ఈ చిత్రంలో జయసింహ ఓ పోలీస్ అధికారిగా, ఇతరుల ఫోన్లు ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వివాహేతర సంబంధాల వల్ల వచ్చే సమస్యల ఆధారంగా రూపొందింది.