Advertisementt

ఈ నిర్మాతలు అస్సలు తగ్గడం లేదుగా!

Fri 01st Dec 2017 04:59 PM
mythri movie makers,advance,star heroes  ఈ నిర్మాతలు అస్సలు తగ్గడం లేదుగా!
Mythri Movie Makers Top in Tollywood in Movie Making ఈ నిర్మాతలు అస్సలు తగ్గడం లేదుగా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూవీ క్రియేషన్స్ వారు మీడియం రేంజ్ మూవీస్ తీస్తూ హిట్ కొడుతూనే సాహో వంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా సినిమాల మీద సినిమాలు నిర్మిస్తూ వారి ప్రతాపం చూపిస్తున్నారు. అందులో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే ఉండడం గమనార్హం. ప్రస్తుతం.. షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న  రంగస్థలం, సవ్యసాచి సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు చాలా సినిమాలు చేసేందుకు అడ్వాన్స్ లు ఇచ్చి మరి రెడీగా వుంది.

అందులో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, నాని సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళుతున్న మైత్రి వారు మరికొంతమంది స్టార్ హీరోలకు  అడ్వాన్సు ఇచ్చేసి వారిని బుక్ చేసినట్లుగా టాక్. అందులో భాగంగానే త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీని సెట్ చేసింది ఈ సంస్థ. అలాగే అటు మహేష్ కి, ఇటు త్రివిక్రమ్ కి ఇద్దరికీ అడ్వాన్స్ లు ముట్టేశాయి. మరోపక్క ప్రభాస్, పవన్ లకు కూడా మైత్రి మూవీస్ వారు అడ్వాన్స్ లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మహేష్ - త్రివిక్రమ్ సినిమా ఆగష్టు లో మొదలయ్యే ఛాన్స్ ఉండగా... ప్రభాస్ కి దర్శకుడుని ఫైనల్ చెయ్యాల్సి ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీస్ తియ్యబోయే సినిమాకి దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ పేరు వినబడుతుంది. వీరే కాకుండా రవితేజ, అఖిల్, సాయి ధరమ్ తేజాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారి లిస్ట్ లో ఉన్న హీరోలు. మరి ఇలా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలామంది  హీరోలను అడ్వాన్స్ లతో లాక్ చేసి ఇండస్ట్రీ నెంబర్ వన్ నిర్మాణ సంస్థ గా పేరును దక్కించుకుంటుంది.

Mythri Movie Makers Top in Tollywood in Movie Making:

Mythri Movie Makers Speed in Movie Making

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ