Advertisementt

సెహభాష్‌ అనిపించుకుంటున్న పోర్న్‌స్టార్‌!

Sat 02nd Dec 2017 01:27 PM
sunny leone,daniel weber,peta campaign  సెహభాష్‌ అనిపించుకుంటున్న పోర్న్‌స్టార్‌!
Sunny Leone and Daniel Weber New PETA Campaign సెహభాష్‌ అనిపించుకుంటున్న పోర్న్‌స్టార్‌!
Advertisement
Ads by CJ

పోర్న్‌స్టార్‌గా జీవితం గడిపి నాలుగైదేళ్ల కిందట ఇండియా వచ్చింది సన్నిలియోన్‌. ఇక ఇక్కడ నటీమణులే నగ్నంగా కనిపించడానికి సై అంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తూ.. ఇండియాలోని వారు కూడా ఇంతేనా? అనే బ్యాడ్‌మెసేజ్‌ని ప్రపంచానికి అందిస్తున్నారు. కాబట్టి ఇందులో సన్నిలియోన్‌ని ప్రత్యేకంగా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఇక ఆమెకున్న బ్రాండ్‌ ఇమేజ్‌ షారుఖ్‌ఖాన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి వారికి కూడా లేదని నిజంగానే ఆమె నిరూపించింది. ఇక ఆమె ఒక్క లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలంటే కోట్లు తీసుకుంటుంది. ఆమెకున్న ఇమేజ్‌ అలాంటిది. ఎన్నో ఉత్పత్తుల వారు ఆమెని తమ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా తీసుకోవడానికి, ఎంతడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈమె ఇండియా వచ్చి సెటిల్‌ అయిన తర్వాత తాను గతంలో తప్పు చేశానని, ఆ జీవితం గురించి ఆలోచిస్తేనే ఎంతో బాధ వేస్తోందని తెలపడమే కాదు. 

ప్రస్తుతం సెక్సీఇమేజ్‌ని కూడా వదిలి విభిన్న నటిగా నిరూపించుకునే పనిలో ఉంది. ఓ భారతీయ అనాధ పాపని దత్తత తీసుకుని తన ఔదార్యం చాటింది. ఇక ఆమె దుస్తులే వేసుకోదు కదా..! మరి ఈమె కాస్టూమ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..! అయినా ఆమె ఈసారి కేవలం తన కోసం, తనకొచ్చే డబ్బు కోసం కాకుండా ఓ మంచి పనికి నగ్నంగా కనిపించింది. జంతు హింసలు వ్యతిరేకించే పెటా సంస్థ ఈ సారి తమ మెసేజ్‌ని జనాలలోకి తీసుకెళ్లడం కోసం ఆమెని రిక్వెస్ట్‌ చేయగా, దాని కోసం తన భర్త డానియెల్‌ వెబర్‌తో కలిసి నగ్నంగా కనిపిస్తూ, పది పైసలు రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా తన గొప్పతనాన్ని చాటి చెప్పింది. 

లెదర్‌ దుస్తులకు వ్యతిరేకంగా ఈమె ఈ యాడ్‌ చేసింది. ఇందులో భార్యాభర్తలిద్దరు నగ్నంగా కనిపిస్తున్నారు. దాని వెనుక కూడా ఓ మెసేజ్‌ ఉంది. మనకి బట్టలుంటే ఎంత అందమో.. జంతువులకు చర్మం కూడా అంతే అవసరమని, మొసళ్లు, పులులు, కుందేళ్లు, నక్కతోలు, కుక్కతోలు వంటి వాటితో చేసే లెదర్ వస్తువులను, డ్రస్‌లని వాడవద్దని సందేశం ఇచ్చింది. జంతువుల చర్మం కోసం వాటిని కిరాతకంగా చంపి, తలలు పగులగొట్టి, షాక్‌ ఇచ్చి మరీ చంపుతారని దయచేసి అలాంటి వాటిని వాడకుండా సింథటిక్‌ లెదర్‌ని వాడాలని మెసేజ్‌ ఇస్తోంది. ఎంతైనా సన్ని ఇలాంటి విషయాలలో గ్రేట్‌ అని ఒప్పుకోవాల్సిందే...! 

Sunny Leone and Daniel Weber New PETA Campaign:

Sunny Leone and Daniel Weber Promote Animal-Free Fashion in New PETA Campaign

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ