పవన్ కళ్యాణ్ పేరు వినబడితే చాలు అభిమానులకు ఎలాంటి పూనకాలు వచ్చేస్తాయో అందరికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరో హీరోకి లేని అభిమాన గణం పవన్ కళ్యాణ్ కి ఉందంటే.. అతిశయోక్తి కాదు. ఆయన గత సినిమాల ప్లాప్స్ ని ఫ్యాన్స్ అస్సలు పట్టించుకోరు. పవన్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతలోనే ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరియు పవన్ ఆప్తుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు తిక్కకి లెక్కలేనంత ఉన్నాయంటే నమ్ముతారా..
అజ్ఞాతవాసి విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలతోపాటే ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటికే పబ్లిసిటీ కార్యక్రమాలను షురూ చెయ్యడానికి చిత్ర బృందం సమాయత్తమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడుకొని లాభాలు మూటగట్టుకోవాలని బడా కంపెనీలు ప్లాన్ చేశాయి. అందులో భాగంగానే చిత్ర బృందంతో కలిసి ప్రముఖ సెల్ కాన్ మొబైల్ కంపెనీ ఒక భారీ డీల్ ను సెట్ చేసుకునే ప్రయత్నం మొదలెట్టింది. దాదాపు 50 వేల ఫోన్లను #PSPK25 బ్రాండింగ్ మీద ఆ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేయాలనీ చూస్తోంది.
ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి మరికొన్ని ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ మొబైల్స్ ని కూడా #PSPK25 బ్రాండ్ నేమ్ తో రిలీజ్ చేయాలనీ కంపెనీ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ కంపెనీ ఆలోచనకి చిత్ర బృందంతో పాటు... దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ లు కూడా సానుకూలంగా వున్నారని తెలుస్తుంది. ఇకపోతే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మొబైల్ కంపెనీ తన పని మొదలెట్టడానికి రెడీగా ఉంది.