Advertisementt

త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు ట్రైలర్సే..!

Mon 04th Dec 2017 01:10 AM
abburi ravi,trivikram srinivas,trailers,director and writer  త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు ట్రైలర్సే..!
Abburi Ravi Talks About Trivikram Srinivas త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు ట్రైలర్సే..!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ హిట్ సినిమాలే. ఆయన మాటల రచయితగా అనేక సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించాడు. త్రివిక్రమ్ మాటల్లో అద్వితీయమైన అర్ధం దాగుంటుంది. త్రివిక్రమ్ డైలాగ్ అంటే యువత దగ్గరనుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అమితంగా ఇష్టపడతారు. త్రివిక్రమ్ నుండి సినిమా వస్తుంది అంటే.. అందులోని హీరో ఎవరనే ఆలోచన లేకుండానే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళతారు. అయితే ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు చాలానే కష్టాలే పడ్డాడు. త్రివిక్రమ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యేటప్పటి నుండి కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో సునీల్ ఒకడని అందరికి తెలుసు. మరొక మాటల రచయిత అబ్బూరి రవి కూడా త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్.

అసలు అబ్బూరి రవిని సినిమాల్లోకి తీసుకొచ్చింది త్రివిక్రమ్. వారిద్దరూ క్లాస్ మేట్స్, రూంమేట్స్ అలా మంచి ఫ్రెండ్ అన్నమాట. అయితే ఈ మధ్యన అబ్బూరి రవి ఒక ఇంటర్వ్యూ లో తన ఫ్రెండ్ త్రివిక్రమ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన త్రివిక్రమ్ లోని రైటర్ ని ఎక్కువగా ఇష్ట పడతారా? .. ఆయనలోని దర్శకుడిని ఎక్కువగా ఇష్ట పడతారా? అనే ప్రశ్నకు అబ్బూరి రవి... త్రివిక్రమ్ లోని రైటర్ .. డైరెక్టర్ ఇద్దరూ గొప్పవాళ్లే.  అంటూ లాజికల్ గా సమాధానం చెప్పడమే కాదు... ఇంకెన్నో విషయాలను కూడా చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్ ఆలోచన శక్తి మామూలుది కాదని.. ఆయన చదువు వేరు .. ఆయన పరిశీలనా శక్తి వేరు... అంతే కాకుండా త్రివిక్రమ్ కి ఉన్న అవగాహన శక్తి వేరు... అసలు త్రివిక్రమ్ కెపాసిటీయే వేరని చెబుతున్న అబ్బూరి.. త్రివిక్రమ్ గురించి మరింత గొప్పగా చెప్పాడు. అదేమిటంటే. ఇప్పుడు త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలకంటే 100 రెట్లు గొప్పగా సినిమాలు చేయగలడని...  ఆయనకి గల ప్రతిభను బట్టి చూస్తే .. అసలు ఇప్పుడు త్రివిక్రం చేస్తోన్న సినిమాలన్నీ త్వరలో ఆయన చేయనున్న సినిమాలకు కేవలం ట్రైలర్స్ లాంటివనేది నా అభిప్రాయం అంటూ తన ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పాడు అబ్బూరి.

Abburi Ravi Talks About Trivikram Srinivas:

Abburi Ravi about Trivikram Greatness

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ