అను ఇమ్మాన్యుయేల్ సుడి మాములుగా లేదు. అమ్మడు మెగా హీరోలతో ఒక రేంజ్ లో దూసుకు పోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో జోడి కట్టిన అను.. మొన్న అల్లు అర్జున్ పక్కన నా పేరు సూర్య లో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మరో బిగ్ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు.
ముందు మెగా ఫ్యామిలీ వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ కి ఓటేసినప్పటికీ.... తాజాగా రకుల్ ని తప్పించి అనుకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డి.వీ.వీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డి.వీ.వీ దానయ్య నిర్మాతగా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అయితే ప్రస్తుతానికి హీరోయిన్ గా అను సెలక్షన్ ను సీక్రెట్ గా ఉంచుతున్నారు. త్వరలోనే అధికారికంగా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ని బోయపాటి ఏ రేంజ్ మాస్ హీరోగా చూపించబోతున్నాడో అని ఇండస్ట్రీలో హాట్ హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి.
ఆక్సిజన్ సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన అనుకి ఆ సినిమా విడుదల కాకముందే అనుకోని ఆఫర్స్ తో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాల్లో నటించిన అను ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమాతో పాటు బన్నీ సరసన నా పేరు సూర్య అనే సినిమాల్లో నటిస్తోంది. నాగచైతన్య, మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా అనునే హీరోయిన్. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్ గా అను పేరు పరిశీలనలో ఉంది. ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ సరసన. మరి అను ఇమ్మాన్యువల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన తొలినాళ్ళకే టాప్ హీరోయిన్ చైర్ సొంతం చేసుకునేలా కనబడుతుంది.