ప్రస్తుతం పవన్ అభిమానులు తనపై ఎటాక్ చేస్తూ ఉండటంతో క్రిటిక్ కత్తి మహేష్ అభిమానులతోపాటు పవన్‌ని కూడా టార్గెట్ చేస్తూ ప్రతి దానికి కౌంటర్‌గా సెటైర్లు వేస్తున్నాడు. దీనిపై తాజాగా పవన్ పరోక్షంగా కత్తి మహేష్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఎవరైనా బలంగా ప్రశ్నిస్తున్నప్పుడు విమర్శలు రావడం సహజమే. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నేనేమీ బంగారాన్ని కాదు.. నేను కూడా మనిషినే. ఇక తనలోని అంశాలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చవు. నన్ను ద్వేషించేవారు తమ జీవితంలోని అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నట్లే. మనిషి నవ్వితే కొద్దిమేర కండరాలు కదులుతాయి.
ఒకరిని ద్వేషించే సమయంలో మాత్రం శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. రక్తం పాడవుతుంది, మొహంలోని కండరాలు పాడవుతాయి. మీరు నాలాగే సహనంగా ఉండండి. ప్రతి మనిషికి సహనం ఉండాలి. కానీ చనిపోయేంత సహనం అవసరం లేదు. అంత సహనం నేను కూడా భరించలేను, చేతులు కట్టుకుని కూర్చొమని చెప్పడం లేదు. అదే సమయంలో ఎదురు దాడి చేయాల్సిన పని కూడా లేదు. అవసరమైన సమయాల్లో స్వీయరక్షణ చేసుకుందాం. ఎవరైనా విమర్శలు చేస్తుంటే పట్టించుకోవద్దు. లేకపోతే కొన్నిరోజుల తర్వాత కొందరిని మనమే తిట్టి పబ్లిసిటీ ఇచ్చి ఎందుకు పెంచి పెద్దవాళ్లని చేశామా? అని మనమే బాధపడాల్సివస్తుంది. నన్ను షబీర్‌అలీ, దానం నాగేందర్‌లు కూడా తిడతారు. నేను కూడా కొందరిని ఏవేవో అంటాను.
కానీ వారు కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటాం. అది బేసిక్ కర్టసీ అని తెలిపాడు. పవన్ మాత్రం ఈ విషయంలో చాలా హుందాగానే ప్రవర్తించాడని చెప్పవచ్చు. కానీ తనను విమర్శించే వారు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారని చెబుతూనే, సహేతుక విమర్శలను మనస్తూర్తిగా స్వీకరిస్తామని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.