యువీ క్రియేషన్స్ వారు చిన్న సినిమాలను నిర్మిస్తూనే సూపర్ హిట్స్ కొట్టుకుంటూ పోతుంది. అదే టైం లో భారీ సినిమాలను నిర్మిస్తూ బడా నిర్మాణ సంస్థగా మారిపోయింది. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ఆంధ్రాలో మంచి పట్టుంది. ఎటువంటి సినెమాలనైనా రికార్డు థియేటర్లలో రిలీజ్ చేయగల సత్తా ఉంది వీళ్ళకి. మల్టీఫ్లెక్సులు కంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఉన్న ఆంధ్రాలో యూవీకి తిరుగులేదు. అయితే ఆంధ్రలో తిరుగులేని ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు తెలంగాణలోకి కూడా ఎంటరైంది.
అలా తెలంగాణకి ఎంట్రీ ఇచ్చింది కూడా మైత్రీ మూవీస్ మేకర్స్ మూవీ రంగస్థలం సినిమాతో కావడం విశేషం. అయితే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది దిల్ రాజే. ఆ తర్వాతే ఏషియన్ సురేష్ కనిపిస్తారు. ఇక అక్కడ దిల్ రాజు, ఏషియన్ సురేష్ తప్ప మిగతావాళ్ళెవరూ డిస్ట్రిబ్యూషన్ చెయ్యడానికి సాహసించడం లేదు. ఇక దిల్ రాజు, ఏషియన్ సురేష్ ల సహకారంతో నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ తమకున్న థియేటర్లను పంచుతుంటారు. ఇప్పుడీ మార్కెట్లోకి నేరుగా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ.
రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న రంగస్థలం ప్రస్తుతం మేకింగ్ స్టేజ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నైజాం రైట్స్ ను యూవీ దక్కించుకుంది. అంతేకాకూండా వెస్ట్, సీడెడ్ లో కొంత భాగం కూడా యూవీకే ఉంది. మరి దీన్నిబట్టి రంగస్థలం లాంటి డిఫరెంట్ మూవీతో యూవీ నిర్మాతలు పెద్ద సాహసం చేస్తున్నారనే చెప్పాలి.