ప్రస్తుతం టాలీవుడ్‌లో అనుష్క, తమన్నా, కాజల్ అగర్వాల్, త్రిష వంటి వారి కెరీర్స్ చివరి దశకు వచ్చాయి. రకుల్‌ప్రీత్‌సింగ్ హవా కూడా తగ్గింది. ఇక కీర్తిసురేష్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు పెద్దగా ఎక్స్‌పోజింగ్‌కి రెడీగా లేరు. మెహ్రీన్ ఇంకా స్టార్ హీరోల దృష్టిలో పడలేదు. రాశిఖన్నా పరిస్థితి కూడా అదే. అలాంటి సమయంలో నటన, టాలెంట్, గ్లామర్ మూడు కలబోసిన హీరోయిన్లు తక్కువగా కనిపిస్తున్నారు. సమంతకి కూడా వివాహం జరిగిపోవడంతో ఇక అందరి దృష్టి కైరా అద్వానీ, శ్రద్దాకపూర్‌లపై ఉంది. కానీ వీరికంటే ముందే అను ఇమ్మాన్యుయేల్ స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్‌తరుణ్ హీరోగా వచ్చిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో ఎంటరైన ఈ భామ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి'లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పేరుతో సెకండ్ హీరోయిన్ గానీ, కీర్తిసురేష్ గ్లామర్‌షో చేయదు కాబట్టి ఆ బాధ్యతలను అను ఇమ్మాన్యుయేల్ మోయనుంది. ఈ చిత్రంపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లో నటిస్తోంది.
మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో కూడా ఈమెనే తీసుకున్నారని సమాచారం. మరోవైపు నాగచైతన్య-మారుతిల దర్శకత్వంలో రూపొందుతున్న 'శైలజారెడ్డి అల్లుడు'లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా ఈమెకి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్‌లు నటించే మల్టీస్టారర్ మూవీలో కూడా ఈ ఇద్దరు హీరోలలో ఒకరి సరసన నటించడం ఖాయమంటున్నారు. మరి ఈ విషయం నిజమా? కాదా? అనేది స్వయంగా యూనిట్ ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు.