మహేష్‌బాబు సోదరి మంజుల చాల రోజుల తర్వాత మీడియాలో హల్చల్ చేస్తుంది. మంజుల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మనసుకు నచ్చింది చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న.. తరచూ మీడియా ముందుకు వస్తుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం జనవరి 26న రానుంది. ఈ చిత్రం కంటే కూడా ఆమె తదుపరి ప్లాన్ చేస్తోన్న చిత్రం ఆసక్తి కలిగిస్తోంది. అదేమిటంటే.. తల్లి ఇందిర పేరు మీద స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్స్‌ని తిరిగి మళ్లీ బిజీ చేసే పనిలో మంజుల నిమగ్నమయింది.
ఇందిరా ప్రొడక్షన్స్ లో మంచి ఫామ్‌లో వున్న నానితో ఒక సినిమాకి ప్లాన్స్ జరుగుతున్నాయనే టాక్ వినబడుతుంది. అంతేకాకూండా ఇందిరా ప్రొడక్షన్స్‌కి నాని ఇప్పటికే డేట్స్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. అయితే ఈ చిత్రం భారీ స్థాయిలో వుంటుందని.... అలాగే ఈ సినిమాకి దర్శకుడు కూడా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ అని సమాచారం అందుతుంది. అఖిల్ తో తెరకెక్కిస్తున్న హలో తర్వాత విక్రమ్ తీసే సినిమా ఇదే అవుతుందట. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలను ఇంతవరకు నాని గాని, దర్శకుడు విక్రమ్ కుమార్ గాని అటు మంజుల అధికారికంగా ఖరారు చేయలేదు.
విక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న హలో సినిమా ఈ నెల 22 న విడుదలకు సిద్దమవుతుండగా... నాని మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఈనెల 21 నే విడుదలవుతుంది. అలాగే నాని మరోచిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న కృష్ణార్జున యుద్ధం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఆ చిత్రం తర్వాత నాని, మంజుల నిర్మాతగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలుపెడతాడేమో చూద్దాం.