Advertisementt

నిర్మాత అయ్యాక దిల్ రాజుని మరిపిస్తున్నాడు!

Sat 16th Dec 2017 12:16 AM
nani,producer,awe movie,promotion,dil raju  నిర్మాత అయ్యాక దిల్ రాజుని మరిపిస్తున్నాడు!
Nani Sensation with Awe Movie Promotion నిర్మాత అయ్యాక దిల్ రాజుని మరిపిస్తున్నాడు!
Advertisement
Ads by CJ

నాని సినిమాల్లో హీరోగా నటిస్తూ డబ్బులు సంపాదించడం కాదు, ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. నాని నిర్మిస్తున్న తన తొలి సినిమాకి ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ముందు నుండే నాని ఇది ఒక చిన్న సినిమా అని చెప్పుకొచ్చాడు. కాని ఇప్పుడు రోజుకో పోస్టర్ ను సోషల్ మీడియాలో వదులుతూ ఆసక్తిని కలిగిస్తుంటే మాత్రం ఇదొక చిన్న సినేమానా అన్న డౌట్ రాక మానదు.

సాధారణంగా చిన్న సినిమాలు అంటే.. రెండు లేదా మూడు కోట్లలో సినిమా కంప్లీట్ చేస్తారు. కానీ నాని సినిమా మాత్రం కచ్చితంగా పది కోట్లు దాటే అవకాశంవుంది. ఎందుకంటే ఇందులో పెద్ద నటీనటులు నటిస్తున్నారు. సైంటిస్టుగా అవసరాల శ్రీనివాస్ లుక్.. అలాగే ఒక వైల్డ్ లేడీగా ఒళ్ళంతా టాటూలు వేసుకున్న రెజీనా కసాండ్ర లుక్ చూస్తుంటే.. ఇదేదో చిన్న సినిమా అని మాత్రం అనుకోలేం కదా.

మరి డైరెక్టర్ తన తెలివితో అత్యంత తక్కువ బడ్జెట్ తో ఇలాంటి రిచ్ లుక్ తెప్పించుంటాడా? ఏమో చెప్పలేం. ఇక అవయవ దానం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేస్తుండగా. రెజినా, ఈషా, అవసరాల శ్రీనివాస్, కాజల్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. నాని అయితే నిర్మాతగా ఈ సినిమాపై అంచనాలు తెగ పెంచేస్తున్నాడు. గత వారం రోజులుగా రెండు రోజులకో క్యారక్టర్ పోస్టర్ ను జనాలకు పరిచయం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాగే నాని కూడా ప్రొమోషన్స్ బాగా చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Nani Sensation with Awe Movie Promotion:

Nani Crossed Dil Raju in movie Promotion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ