Advertisementt

భూమిక కోసం నాని, సాయిపల్లవికి అన్యాయం!

Sun 17th Dec 2017 10:20 PM
nani,sai pallavi,bhoomika,removed scenes,mca movie,dil raju  భూమిక కోసం నాని, సాయిపల్లవికి అన్యాయం!
Dil Raju Removed Sai Pallavi Scenes From Mca Movie భూమిక కోసం నాని, సాయిపల్లవికి అన్యాయం!
Advertisement
Ads by CJ

 

వచ్చే శుక్రవారం రెండు మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి నాని నటించిన దిల్ రాజు బ్యానర్ లో ఎంసిఏ. ఇంకోటి అఖిల్ రెండో సినిమా హలో. ఈ రెండిటిలో నాని ఎంసీఏ గురువారం విడుదలవుతుండగా.. అఖిల్ హలో మూవీ మాత్రం శుక్రవారం రిలీజ్ అయ్యి సందడి చేయనున్నాయి. ఎంసిఏ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ తో బయటికి వచ్చింది.

అయితే ఎంసీఏ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా చుట్టూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయ్. సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడూ సెన్సార్ వాళ్ళు అస్సలు కట్స్ వెయ్యకుండా సర్టిఫికెట్ ఇచ్చారట ఎంసీఏ కి. అయితే అక్కడ సెన్సార్ కట్స్ లేకపోయినా... ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సినిమాలో చాలానే కట్స్ వేశాడని టాక్. వదిన అండ్ మరిది అనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమాలో... నాని - భూమిక మధ్య సాగే సీన్స్ ఉంచి..సాయి పల్లవి - నాని మధ్య రొమాంటిక్ సీన్స్ కట్ చేశాడని వినికిడి. 

ఇందుకు కారణం సాయి పల్లవి - నానీల మధ్య రొమాంటిక్ సీన్స్ హైలైట్ అయ్యి....  నాని - భూమిక అంటే వదిన - మరిది సీన్స్ ను డామినెటే చేస్తున్నాయి అని దిల్ రాజు భావించి ఇలా చేశాడని దిల్ రాజు సన్నిహితులు చెబుతున్నారు. నాని సీన్స్ కట్ చేస్తే పర్లేదు కానీ సాయి పల్లవి సీన్స్ కట్ చేస్తే మాత్రం సాయి పల్లవి ఊరుకుంటుందా.. చూద్దాం ఫైనల్ గా ఏ సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయో..?

Dil Raju Removed Sai Pallavi Scenes From Mca Movie:

Bhoomika Villain for Nani and Sai Pallavi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ