పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ తోను, పోస్టర్స్ తోనూ, ఫొటోస్ తోనూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ రోజు బుధవారం అజ్ఞాతవాసి ఆడియో కూడా రిలీజ్ విడుదల చెయ్యబోతున్నారు. ఇలా అజ్ఞాతవాసి టీజర్, ఆడియో హంగామాలు ముగియగానే.. మరో సంక్రాంతి హీరో బాలయ్య రంగంలోకి దూకబోతున్నాడు. అజ్ఞాతవాసికి పోటీగా బాలకృష్ణ జై సింహా ప్రమోషన్ ను కూడా ప్రారంభించబోతున్నాడు. ఈనెల 24న ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ భారీ ఎత్తున చేయబోతున్నారు.
అయితే అంతకంటే ముందే అసలు సిసలైన జై సింహా సందడి షురూ కానుంది. జై సింహాకు సంబంధించి టీజర్ విడుదల చెయ్యడమే కాకుండా ఆ వెంటనే జై సింహాలోని ఓ సాంగ్ కూడా విడుదల చేయబోతున్నారు. ఆడియో రిలీజ్ కంటే ముందే ఇదంతా జరగబోతుందని న్యూస్ నందమూరి ఫ్యాన్స్ ని నిలబడనీయడం లేదు. ఆడియో ఫంక్షన్ ముగియగానే.. మరో రోజు ట్రయిలర్ లాంచ్ కూడా వుంటుందట. ఇక అక్కడ్నుంచి చూడండి జై సింహా సాంగ్ బిట్స్ ని వరుసగా విడుదల చేయబోతున్నారట.
ఇప్పటివరకు ఎటువంటి సందడి లేకుండా ఇలా ఒక్కసారే ప్రమోషన్స్ లో వేగం పెంచాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందట. అందులో భాగంగానే జై సింహా ఆడియో డేట్ పోస్టర్ ని విడుదల చేసిరి. ఆ పోస్ట్స్ లో బాలయ్య బాబు లుక్ అదుర్స్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ పండగ మొదలెట్టేశారు. ఇకపోతే బాలయ్య, నయనతారది క్రేజీ కాంబినేషన్. తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన సీనియర్ కేఎస్ రవికుమార్ డైరక్టర్. అందుకే జై సింహాపై బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి బరిలో పవన్, బాలయ్య సినిమాలు పోటీపడబోతున్న విషయం తెలిసిందే.