సినిమా స్టార్స్‌కి క్రేజ్, ఇమేజ్‌లు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయా హీరోల కంట్లో పడాలని, కేవలం వారితో కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలనేదే ఇలాంటి వీరాభిమానుల చేష్టలకు కారణం. కొందరు వారిని హద్దు మీరినందుకు కొడితే మరికొందరు మాత్రం వారి చిరుకోరికలను తీర్చి పంపిస్తూ ఉంటారు. ఇక తాజాగా జరిగిన పవన్-త్రివిక్రమ్ చిత్రం 'అజ్ఞాతవాసి' వేడుక సందర్బంగా యాంకర్ సుమ పవన్‌ని స్టేజీ మీదకి పిలవగా, ఆయన నడుచుకుంటే స్టేజీ ఎక్కబోయే సమయంలో ఓ వీరాభిమాని పవన్ సెక్యూరిటీ కళ్లు గప్పి పవన్ కాళ్లను పట్టుకుని, సాష్టాంగపడి నానా హంగామా సృష్టించాడు.
ఈ షాక్ నుంచి తేరుకున్న పవన్ సెక్యూరిటి ఆ అభిమానిని ఈడ్చుకెళ్లడం చూసి పవన్ మనసు చివుక్కుమంది. వెంటనే ఆయన తన సెక్యూరిటీ వాళ్లని అలా ఈడ్చుకెళ్లవద్దని వారించి, ఆ బక్కపలచటి అభిమానిని పిలిచి ఏం కావాలి ? అని ప్రశ్నించాడు. దానికి ఆ అభిమాని ఓ సెల్ఫీ కావాలని కోరాడు. వెంటనే పవన్ ఆ ఫ్యాన్‌తో సెల్ఫీ దిగి పంపి వేశాడు.
ఇలాంటి అభిమానుల వల్ల ఇబ్బందేమీ ఉండదని, కానీ సమయాభావం వల్లనే తాను ప్రతి ఒక్కరిని పేరు పేరునా పిలిచి, వారి కోర్కెలు తీర్చలేకపోతున్నానని చెప్పడంతో ఆడిటోరియం మొత్తం 'పవర్‌స్టార్.. పవర్‌స్టార్...' అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సంఘటన ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఇలాంటి సంఘటనలే గతంలో చిరంజీవి, రజనీకాంత్ నుంచి ఐఐఎఫ్‌ఏ వేడుకల్లో చియాన్ విక్రమ్‌కి కూడా ఎదురుకాగా, ఆయన కూడా పవన్ తరహాలోనే ఆ అభిమానితో సెల్ఫీ దిగి పంపించాడు.