వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న నా పేరు సూర్య సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదలకు డేట్ లాక్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించబోయే నెక్స్ట్ సినిమా ఏమిటనే సస్పెన్స్ మాత్రం ఇంకా తెగడం లేదు. ఏదో కొత్త దర్శకుడికి అల్లు అర్జున్ అవకాశం ఇస్తున్నాడని టాక్ తప్ప మిగతా వివరాలేమీ బయటికి రావడం లేదు. రెడ్డి అనే కొత్త దర్శకుడిని తెలుగు ఇండిస్టీకి పరిచయం చేస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ దర్శకుడు మొన్నామధ్యన బన్ని ఊటీలో ఉండగా కథ వినిపించాడని.. కథ నచ్చి తప్పక చేద్దామని బన్నీ మాటిచ్చినట్లుగా కూడా టాక్. అయితే ప్రస్తుతం బన్నీ ఆ కొత్త దర్శకుడితోనే తన నెక్స్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆ దర్శకుడు చెప్పిన కథ క్రీడా నేపథ్యంలో అంటే బాక్సింగ్ నేపథ్యంలో ఉందంట. అలాగే ఈ సినిమాని అల్లు అర్జున్ స్వయంగా నిర్మించనున్నాడని టాక్ కూడా బయటికి వచ్చింది. ఒక కొత్త కథ, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత బన్నీ కలయికలోనే ఈ మూవీ నా పేరు సూర్య తర్వాతే ఉండబోతుంది.
మరి ఇప్పటిదాకా నిర్మాణంలో వేలు పెట్టని అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా తన ఓన్ బ్యానర్ గీత ఆర్ట్స్ ని కాదనుకుని ఇలా కొత్త బ్యానర్ ని స్థాపించి సినిమాలు నిర్మించాలనుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.. కానీ ఇలా ఒక నిర్మాణ సంస్థ స్థాపించడం మంచిదే. ఎలాగూ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో తన తండ్రి సినిమాలు నిర్మిస్తున్నాడు. మరి చరణ్ లాగా అల్లు అర్జున్ హీరో, నిర్మాత అవతారాలతో అదరగొడతాడో లేదో.. గాని.. ఈ కొత్తబ్యానర్ లో కొత్త దర్శకుడితో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కొత్త సినిమా వచ్చే ఏడాది మే లో ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు.