బాహుబలి సినిమాతో ఎంత మంది జీవితాలు మారాయో తెలియదుగాని.. ముఖ్యంగా రాజమౌళి, ప్రభాస్ సింగల్ నైట్ లో స్టార్స్ అయ్యారు. బాహుబలి ఫ్రాంచేజీతో వీళ్లు కోట్ల రూపాయలు సంపాదించారు కూడా. దేశవ్యాప్తంగా అధిక ఆదాయం ఆర్జించిన వంద మంది సెలబ్రిటీల లిస్ట్ ను ఫోర్బ్స్ సంస్థ బయటపెట్టింది. ఈ లిస్ట్ లో యథావిధిగా మొదటి స్థానంలో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. లిస్ట్ లో టాప్-100 సెలబ్రిటీల జాబితాలో సౌత్ స్టార్స్ తో పాటు మన ప్రభాస్ రాజమౌళి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆఖరి స్థానంలో బన్నీ నిలిచాడు.
ఫోర్బ్స్ టాప్-100 సెలబ్రిటీల జాబితాలో సౌత్ స్టార్స్ ర్యాంకు, 2017లో ఆదాయ వివరాలు..
పేరులు స్థానం ఆదాయం ( కోట్లు )
S.S. రాజమౌళి 15 55
ప్రభాస్ 22 36.25
సూర్య 25 34
విజయ్ 31 29
రానా 36 22
మహేష్ బాబు 37 19.63
జయం రవి 39 18
పవన్ కళ్యాణ్ 69 11.33
మోహన్ లాల్ 73 11.03
అల్లు అర్జున్ 81 7.74