రాజమౌళి ఐదేళ్ల పాటు నిద్రాహారాలు వదిలి తెరకెక్కించిన అద్భుత కళా ఖండం బాహుబలి (పార్ట్ 1 , 2 లు). రాజమౌళి పడిన కష్టానికి కావాల్సిన ప్రతి ఫలం దక్కింది కూడా. బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఎప్పుడూ అన్నిటిలో ముందుండే.. బాలీవుడ్ బాక్సాఫీసుని కూడా బాహుబలి 2 చీల్చి చెండాడింది. అయితే బాహుబలి 2 బాక్సాఫీసు రికార్డులను కేవలం ఖాన్స్ త్రయంలోని సల్మాన్ ఖాన్ మాత్రం తిరగరాస్తాడనుకున్నారు. బాహుబలి విడుదలైనప్పుడు సల్మాన్ బాహుబలి కలెక్షన్స్ గురించిన మట్లాడిన మాటలు ఎప్పటికి ఎవరూ మర్చిపోలేరు. కానీ సల్మాన్ ఖాన్ నుండి వచ్చిన ట్యూబ్ లైట్ తో బాహుబలి రికార్డులను కొట్టలేక చతికిల పడ్డాడు సల్మాన్.
అయితే ఇపుడు సల్మాన్ బాహుబలి మొదటి రోజు కలెక్షన్స్ ని టైగర్ జిందా హై తో దాటేస్తాడని.... మొదటి రోజు బాహుబలి 2 ని మట్టికరిపించి సల్మాన్ రికార్డులు సృష్టిస్తాడని బాలీవుడ్ సినీప్రియులు కలలు కన్నారు. అందుకే టైగర్ జిందా హై ని అన్నిటికన్నా ఎక్కువగా 4600స్క్రీన్స్ లో విడుదల చేసినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఇంత భారీ ఓపెనింగ్ ఉన్నప్పటికీ బాహుబలి 2ను క్రాస్ చేయలేకపోయింది సల్మాన్ టైగర్. కనీసం బాహుబలి 2కు దగ్గరగా కూడా రాలేక చతికిల పడింది. అయితే రాజమౌళి బాహుబలికి మొదటి రోజు ఏకంగా 44కోట్ల రూపాయల వసూళ్లు వస్తే.. సల్మాన్ టైగర్ కి మాత్రం 33కోట్ల 75లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.
మరి మొదటి రోజుకే బాహుబలి 2 ని టచ్ చేయలేకపోయినా టైగర్ జిందా హై వీకెండ్ వసూళ్లలో కూడా సల్మాన్ సినిమా బాహుబలి 2ను క్రాస్ చేయడం కష్టం అంటున్నారు. ఎందుకంటే.. సల్మాన్ టైగర్ జిందా హై కి మొదటి రోజు హిట్ టాక్ వచ్చినా... కొన్ని చోట్ల మాత్రం సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. అందుకే బాహుబలి ఫిగర్ ని అందుకోవడం అనేది ఇప్పుడు సల్మాన్ కి సాధ్యమయ్యే పని కాదు.