Advertisementt

నాని మళ్లీ టార్గెట్ ఫిక్స్ చేశాడు..!

Mon 25th Dec 2017 09:29 PM
nani,krishnarjuna yuddham movie,3 months,hero,time fixed  నాని మళ్లీ టార్గెట్ ఫిక్స్ చేశాడు..!
Nani Krishnarjuna Yuddham Movie Shooting Update నాని మళ్లీ టార్గెట్ ఫిక్స్ చేశాడు..!
Advertisement
Ads by CJ

నాని తాజా చిత్రం ఎంసీఏ సినిమా విడుదలై 4  రోజులైంది. ప్రస్తుతం అంతా ఈ సినిమా టాక్ గురించి, ఈ సినిమాకొచ్చిన కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే హీరో నాని సోషల్ మీడియాలో తన ఎంసీఏ సినిమా గురించిన పబ్లిసిటీ చేస్తూనే వున్నాడు. నాని, సాయి పల్లవి మ్యానియాతో సినిమా మాత్రం లాస్ట్ కి భారీ లాభాలు కొట్టేసేలా వుంది ఎంసీఏ కలెక్షన్స్ చూస్తుంటే. ఇక అన్ని ఎంసీఏ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే...  తన పని తానూ చేసుకుపోతూ బిజీగా వున్నాడు. ప్రస్తుతం నాని తన నెక్ట్స్ ప్రాజెక్టు పనిలో పడ్డాడు. సరిగ్గా ఇవాళ్టి నుంచి 3 నెలల్లో తన అప్ కమింగ్ మూవీ కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు నాని.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నాని సరసన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మ్యాగ్జిమమ్ షూటింగ్ ను పారిస్ లో పూర్తిచేసింది చిత్ర బృందం. ఇకపోతే ఆఖరి షెడ్యూల్ ను కూడా త్వరలోనే మొదలుపెట్టి 3 వారాల్లో టాకీ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఇక మిగిలిన పాటలను ఫిబ్రవరిలో పూర్తిచేసేసి.... మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కృష్ణార్జున యుద్ధాన్ని విడుదల చెయ్యడానికి అటు దర్శకుడు ఇటు హీరో నాని కూడా కంకణం కట్టుకున్నారు. హిప్ హప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

Nani Krishnarjuna Yuddham Movie Shooting Update:

Nani Time Fixed to Krishnarjuna Yuddam Movie Shooting