మహేష్‌బాబు వీలు చిక్కినప్పుడల్లా తన భార్య నమ్రతా, కుమారుడు గౌతమ్‌కృష్ణ, కూతురు సితార్లతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ఏ పండుగ అయినా సరే తన ఫ్యామిలీతో గడుపుతూ హంగామా చేస్తాడు.ఇక క్రిస్మస్ అంటే స్టార్స్ చేసే సందడి అలా ఇలా ఉండదు. మరోవైపు సోషల్‌మీడియాను మహేష్ చాలా పొదుపుగా వాడుతాడు. తన చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌తో పాటు ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తుంటాడు. కాగా క్రిస్మస్ సందర్భంగా మాత్రం మహేష్ ఉదయమే శాంతాక్లాజ్‌తో కలిసి దిగిన ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. సాయంత్రానికల్లా తన కూతురు సితారకు శాంతాక్లాజ్ గెటప్ వేసి ఫొటోలు దిగాడు. మామూలుగానే ఎంతో క్యూట్‌గా ఉండే సితార ఈ కాస్టూమ్స్‌లో మరింత ముద్దొస్తోంది. దీంతో ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఎంతో స్మైలీ ఫేస్‌తో, ఎంతో స్టైలిష్‌గా ఇందులో సూపర్‌స్టార్ కనిపిస్తుండటం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీంతో తరుచుగా ఇలాంటి పండుగలు వస్తూ ఉంటేనైనా తమ అభిమాన హీరోని ఇలా చూసుకునేందుకు అవకాశం లభిస్తుందని ప్రిన్స్ అభిమానులు భావిస్తూ, తరచుగా అయినా మాకు దర్శనం ఇవ్వు అని మహేష్‌ని కోరుతున్నారు.
కాగా ప్రస్తుతం మహేష్ కొరటాల శివతో చేస్తున్న 'భరత్ అనే నేను' షూటింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చాడు. త్వరలో మరలా ఈ షూటింగ్‌లో బిజీ కానున్నాడు. ఇక ఇప్పటివరకు జరిగిన షూటింగ్స్‌లో అసెంబ్లీకి సంబంధించిన సీన్స్ సరిగా రాలేదని వాటిని కొరటాల మరలా రీషూట్ చేయాలని భావిస్తున్నాడట. 'బ్రహ్మోత్సవం, స్పైడర్'ల డిజాస్టర్స్‌తో మహేష్ కూడా ఈ చిత్రంపై మరింత నిశిత దృష్టిని పెడుతున్నాడు.