Advertisementt

సాయి పల్లవి రాలేదంటే ఏదో మ్యాటరున్నట్లే?

Wed 27th Dec 2017 07:32 PM
sai pallavi,fidaa,mca,dil raju,svc success celebrations  సాయి పల్లవి రాలేదంటే ఏదో మ్యాటరున్నట్లే?
No Sai Pallavi In SVC Success Celebrations Event సాయి పల్లవి రాలేదంటే ఏదో మ్యాటరున్నట్లే?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకడు. ఈ ఏడాది 6 సినిమాలు తీయగా 6 హిట్ అవ్వడంతో ఓ ఫంక్షన్ కూడా పెట్టాడు దిల్ రాజు. ఈ ఫంక్షన్ కి సంబందించిన టెక్నీషియన్స్ ని అలాగే తారలను ఇన్వైట్ చేశాడు.

దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన 2017 సక్సెస్ సెలెబ్రేషన్స్ కి అల్లు అర్జున్, అనుపమ, వరుణ్ తేజ్, మెహ్రీన్, నాని, దేవి శ్రీ ప్రసాద్.. ఇలా చాలా మందిని ఇన్వైట్ చేసాడు రాజు. ఈ  సంవత్సరం తీసిన అన్ని సినిమాలలో ఫిదా కి వచ్చిన రెస్పాన్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సినిమా మొత్తంగా 50 కోట్ల బాక్స్ఆఫీస్ ను దాటేసింది. అయితే దిల్ రాజు అందరిని ఇన్వైట్ చేయగా సాయి పల్లవి మాత్రం రాకుండా దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చిందని ఒక టాక్ వినిపిస్తోంది.

సాయి పల్లవి పై అంతకు ముందు వచ్చిన రూమర్స్ ను దిల్ రాజు కవర్ చేసిన సంగతి తెలిసిందే. ఎంసీఏ ప్రమోషన్స్ లలో కూడా ఎక్కువగా పాల్గొనలేదు. మరి దిల్ రాజు ఫంక్షన్ లో రెండు సినిమాలతో హిట్ అందుకున్న సాయి పల్లవి రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఫిదా సూపర్ హిట్, ఎంసీఏ హిట్స్ తో ఉన్న సాయి పల్లవి ఇలా తన నిర్మాత చేసుకున్న సెలెబ్రేషన్స్ కి హ్యాండ్ ఇవ్వడం చిన్న విషయం కాదుగా... ఇక ఎంసీఏ ప్రమోషన్స్ కి కూడా సాయి పల్లవి ఇలానే చేసింది.

హీరో నాని ఒక్కడే మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. మరి టాలీవుడ్ విషయంలో.. దిల్ రాజు సినిమాల విషయంలో సాయి పల్లవి ఇలా ఎందుకు చేస్తున్నట్లు?

No Sai Pallavi In SVC Success Celebrations Event:

Sai Pallavi Not Attend for Dil Raju SVC Success Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ