మెగాస్టార్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. 150 నుండి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్ర రెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలెట్టుకున్న చాన్నాళ్ళకి సెట్స్ మీదకెళ్ళిన సై రా ప్రస్తుతం భారీ లెవెల్ లో ఓ యాక్షన్ సీన్స్ ను ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయి అని వార్తలు కూడా వచ్చాయి. డిసెంబర్ ఆరంభంలో షూటింగ్ స్టార్ట్ చేసి.. హైద్రాబాద్ పరిసరాల్లో తొలి షెడ్యూల్ ను ఫినిష్ చేశారు. అయితే అప్పట్లో సై రా సినిమా షూటింగ్ ఆలస్యమవడానికి కారణం సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ అనే టాక్ నడిచింది.
ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ కానిచ్చేసిన సై రా బృందం ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం రెడీ అయ్యిందట. కానీ వీళ్లకి ఓ సమస్య వచ్చి పడింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండగా.. లేడీ అమితాబ్ రేంజ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నయనతార మెయిన్ లీడ్ గా చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా సై రాకు నయనతార ట్రబుల్స్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఈమె యాక్సెప్ట్ చేసింది కానీ.. డేట్స్ మాత్రం అలాట్ చేయడం లేదట.
సరే అనుకుని షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే.. ఈ షెడ్యూల్ లో ఎక్కువ సీన్స్ నయన్ మీదే ఉన్నాయి అంట. నయన్ మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డి పలుమార్లు నయన్ తో సంప్రదింపులు జరిపినా.. పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. నయన్ పాత్రకు వేరే హీరోయిన్లను కూడా సంప్రదిస్తున్నారని కూడా మరో రూమర్ వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. మరి అప్పట్లో సై రా సెట్స్ మీదకెళ్లడానికి లేట్ కి కారణం ఏ ఆర్ రెహ్మాన్ అంటే... ఇప్పుడు నయనతార అని అంటున్నారు.