స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కలయికలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటిసారి అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక ఆర్మీ అధికారి పాత్రని పోషిస్తున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగబాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.
మాములుగా అల్లు అర్జున్ సినిమాలకి శాటిలైట్ మంచి బిజినెస్ జరుగుతుంది. అలాగే సరైనోడు, డీజే సినిమాల్తో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా నా పేరు సూర్య సినిమా విషయంలో కూడా భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఏకంగా 25 కోట్లకి అమ్ముడుపోయాయి అని తెలుస్తుంది. టీవీలో ప్రసారం చేసుకునే హక్కులతో పాటు డిజిటల్ మీడియా ప్రసార హక్కులను కూడా ఒకే సంస్థ ఇంత భారీ అమౌంట్ కి నా పేరు సూర్య హక్కులను కొనేసిందని సమాచారం. సుమారు 25 కోట్లు ఈ రైట్స్ తోనే రావడంతో సినిమా మేజర్ బడ్జెట్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే రికవర్ అయ్యాయని అంటున్నారు.
మరి అల్లు అర్జున్జ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ ని జనవరి 1 న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేస్తారని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు.