Advertisementt

'కొడకా.. కొడకా..' ఫ్యాన్స్ ని పట్టుకోలేరేమో!

Thu 28th Dec 2017 10:24 PM
pawan kalyan,agnathavasi,kodaka glimpse,trivikram,bhaskara bhatla,anirudh  'కొడకా.. కొడకా..' ఫ్యాన్స్ ని పట్టుకోలేరేమో!
Agnyathavasi Kodaka Koteswara Rao Song Glimpse Released 'కొడకా.. కొడకా..' ఫ్యాన్స్ ని పట్టుకోలేరేమో!
Advertisement
Ads by CJ

సినిమా రిలీజ్‌ దగ్గరపడుతోంది. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు కోటి కళ్లతో జనవరి 10 ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇక టీజర్‌, ఆడియోలోని ఐదు పాటలను రిలీజ్‌ చేసి పవన్‌ అభిమానుల్లో త్రివిక్రమ్‌ జోష్‌ని నింపాడు. ట్రైలర్‌ కోసం అందరూ వెయిట్‌ చేస్తున్నా.. వారిని ఇంకా వెయిటింగ్‌లోనే పెట్టి త్రివిక్రమ్‌ ఈ 'అజ్ఞాతవాసి'పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఆడియోలోని ఐదు పాటలు ఇన్‌స్టెంట్‌ హిట్‌ అయ్యాయి. ఇక పవన్‌ సొంతగా పాడిన పాటను డిసెంబర్‌ 31 సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నామని టీమ్‌ ప్రకటించింది. 

అంటే డిసెంబర్‌ 31 రాత్రి నుంచి జరిగే న్యూఇయర్‌ వేడుకల్లో పవన్‌ ఫ్యాన్స్‌ ఈ పాటని పెట్టుకుని వింటూ హడావుడి, హంగామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తాజాగా పవన్‌ పాడిన 'కొడకా.. కోటేశ్వరరావు' పాట టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో పవన్‌ ఈ పాటని పాడిన విధానాన్ని చూపిస్తూ ఇంట్రెస్ట్‌ కలిగించారు. రికార్డింగ్‌ థియేటర్‌లో పవన్‌, త్రివిక్రమ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, ఆ పాట రచయిత భాస్కరభట్ల రవికుమార్‌లు కనిపిస్తున్నారు. 

పవన్‌ 'కొడకా' అని హమ్‌ చేయడం, వెంటనే త్రివిక్రమ్‌ నవ్వడం, పవన్‌ సిగ్గు పడటం వంటివి పవన్‌ ఫ్యాన్స్‌కి కనుల పండువగా ఉన్నాయి. ఆ తర్వాత పవన్‌ 'కొడకా..' అంటూ ఒక్కసారిగా మూడ్‌లోకి వెళ్లిపోయి పాట పాడటం, చివరలో పవన్‌ కూర్చుని ఓ రిథమ్‌ని అనుకరించడం బాగా ఉంది. మరోవైపు పాట రచయిత భాస్కరభట్ల... పవన్‌కళ్యాణ్‌ సార్‌.. అంత ఈజీగా ఏమీ తెమలనీయరు.. నాకు అది అర్ధమవుతోందని అనడం స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తానికి ఈ పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని పవన్‌ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు...! 

Click here for Kodaka song glimpse

Agnyathavasi Kodaka Koteswara Rao Song Glimpse Released:

Pawan Kalyan Fans Full Kushi with Kodaka Glimpse

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ