రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి వుంది కానీ.. ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతూ వచ్చింది. అందుకే సంక్రాంతికి రావాల్సిన రంగస్థలం మార్చికి వెళ్ళిపోయింది. అయితే సమంత, రామ్ చరణ్ ఈ చిత్రానికి సరిగా డేట్స్ కేటాయించక పోవడం వలనే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమైనదని ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి ఈ సినిమాపై ఏదో ఒక పుకారు వచ్చి పడుతూనే వుంది.
అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా షూట్ కి సంబందించిన హార్డ్ డిస్క్ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కొన్ని సన్నివేశాలు డిలీట్ అయినట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం షాక్ లో ఉందట. ఇంకా చేసేది ఏమి లేక డిలీట్ అయిన సీన్స్ ని దర్శకుడు సుకుమార్ మళ్ళీ రీషూట్ చేస్తున్నారట అందుకే సినిమా లేట్ అవుతుందని ఇప్పుడు తాజా టాక్.