కోలీవుడ్ కి మాత్రమే కాదు ఆయన టాలీవుడ్ కి అంతదాకా వస్తే అసలాయన ఇండియాకే సూపర్ స్టార్. ఆయనెవరో మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. ఆయనెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎంతో గొప్ప వెలుగు వెలుగుతున్నా.... కూడా రజినీకాంత్ కి గర్వం అనే మచ్చ ఎక్కడ అంటే ఎక్కడా కనబడదు. ప్రస్తుతం సినిమాల్లో స్టార్ హోదాలో ఉన్న అయన రాజకీయాల్లోకి రావాలా వద్ద అనే మీమాంసలో కొట్టుకుపోతున్నాడు. రజినీకాంత్ కి ఉన్న అభిమాన గణం మరే హీరోకి లేరంటే అతిశయోక్తి కాదు. అంతమంది అభిమానులున్న రజినీకాంత్ ప్రస్తుతం అభిమానులతో మీటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అయితే ఆ మీటింగ్స్ లో రజినీకాంత్ తన అభిమానులతో పంచుకునే మాటలు కేవలం అభిమానులనే కాదు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
మచ్చుకు కొన్ని... ఒకప్పుడు రజినీకాంత్ అన్నామలై షూటింగ్ కోసం లెజెండ్ యాక్టర్ శివాజీ గణేషన్ తో కలిసి కోయంబత్తూర్ వెళుతున్నారట. అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లో అభిమానుల మధ్య రజనికాంత్ ఉక్కిరి బిక్కిరి అయ్యారట. అభిమానులంతా ఒక్కసారిగా రజినీకాంత్ ని గుమ్మిగూడి... అక్కడే ఉన్న శివాజీ గణేషన్ ని మాత్రం ఎవరు అంతగా పట్టించుకోలేదట. దీంతో కాస్త ఇబ్బంది పడిన రజినీని గమనించిన శివాజీ గణేశన్ ఇలాంటివే గొప్ప జ్ఞాపకాలని వాటిని ఎంజాయ్ చేయమని రజినీకాంత్ ని ప్రోత్సహించారట.
అలాగే ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గడిపే రజినీకాంత్ ఈ మధ్యన ఒక ఆశ్రమాన్ని సందర్శించాలి అనుకున్నారట. అందులో భాగంగానే ఆశ్రమానికి రజినీకాంత్ గారు ఈ టైంకి వస్తారని ఆశ్రమ నిర్వహకులకి చెబితే వెంటనే వారు దయచేసి వేరే టైంకి రమ్మని చెప్పండి అని రిక్వెస్ట్ చేశారట. ఎందుకు అని అడిగితే ఇప్పుడు ఫాంలో ఉన్న టాప్ హీరో ఒకరు అదే టైంకి అక్కడికి వస్తున్నారని.... అక్కడ ఆ హీరోని చూసేందుకు వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయటం కష్టమని.... అప్పుడు మీ విషయంలో నిర్లక్ష్యం జరిగితే కష్టమవుతుందని చెప్పారట. అందుకు రజిని కూడా ఏం మాట్లాడకుండా వేరే టైంకి వెళ్లి ఆ ఆశ్రమాన్ని సందర్శించారట. మరి దీనినిబట్టి రజినీకాంత్ ఎలాంటి వారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ విషయాన్నీ స్వయంగా అభిమానులకు చెప్పిన రజిని... ఇప్పుడు తనకి వయసైపోయిందని... ఇప్పుడు యూత్ లో ఎవరంటే వారినే అభిమానులు ఆదరిస్తారని చెప్పడం చూస్తుంటే దట్ ఈజ్ సూపర్ స్టార్ అనాలనిపించడంలేదు..!